2021 రేసులోకి మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్..!

0

‘కింగ్’ అక్కినేని నాగార్జున చాలా గ్యాప్ తర్వాత హిందీలో కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. ఇందులో రణబీర్ కపూర్ – అమితాబ్ బచ్చన్ – అలియా భట్ – మౌని రాయ్ వంటి స్టార్స్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రంలో నాగ్ ఆర్కియాలజిస్టు పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాన్ని ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ వేదికగా రిలీజ్ చేయడానికి డీల్ కుదిరిందని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కానుందని సమాచారం.

‘బ్రహ్మాస్త్ర’ చిత్రాన్ని 2021లోనే రిలీజ్ చేయాలని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నిర్ణయించుకున్నట్లు బీ టౌన్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఇందుకోసం ‘బ్రహ్మస్త్ర’ టీమ్ కి డెడ్ లైన్ పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ 2021 రేస్ లోకి వచ్చినట్లు అయింది. ఈ ఫాంటసీ మూవీకి బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ మరియు ఫాక్స్ స్టార్ స్టూడియోస్ బ్యానర్స్ పై కరణ్ జోహార్ – అపూర్వ మెహతా – నమిత్ మల్హోత్రా – అయాన్ ముఖర్జీ నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే కొన్ని రోజులు ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్ లో పాల్గొన్న నాగార్జున.. మళ్ళీ షూటింగ్ కోసం ముంబై వెళ్లనున్నారని సమాచారం.