చరణ్ కి జోడీగా డెబ్యూ హీరోయిన్..?

0

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”ఆచార్య”. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ మరియు కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై నిరంజన్ రెడ్డి – రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరు కెరీర్లో 152వ చిత్రంగా రాబోతున్న ‘ఆచార్య’లో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. చిరు కి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. చరణ్ కి జోడీగా ఎవరు నటిస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ముందుగా చరణ్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటించనుందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ అని.. ఇదే క్రమంలో లక్కీ బ్యూటీ రష్మిక మందన్న నటించనుందని వార్తలు వచ్చాయి.

ఇప్పుడు లేటెస్టుగా ‘ఆచార్య’ సినిమాలో చరణ్ కు జోడీగా ఓ డెబ్యూ హీరోయిన్ ని తీసుకోనున్నట్టు ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. నెక్స్ట్ వీక్ చరణ్ కి జోడీని ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇటీవలే ప్రారంభమైన షూటింగ్ లో చిరు – చరణ్ కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించాలని కొరటాల ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం ఇప్పటికే ‘ఆర్.ఆర్.ఆర్’ డైరెక్టర్ రాజమౌళి అనుమతి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. కాగా ‘ఆచార్య’ కొరటాల శివ గత చిత్రాల శైలిలోనే మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ కలబోసిన మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాగా ఉండబోతోంది. ఇటీవల విడుదలైన ‘ఆచార్య’ మూవీ టైటిల్ మోషన్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంది. చిరు – చిరుత కలిసి నటిస్తున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు.