ఫేవరెట్ జర్మన్ కేక్ ఊరిస్తుంటే ఆగేదెలా..!

0

`సాహో` ఫేం.. బాలీవుడ్ నటి ఎవెలిన్ శర్మ సోమవారం 35వ బర్త్ డేని జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్వయంగా తయారు చేసిన ప్రత్యేక పుట్టినరోజు కేక్ ఫోటోలను సోషల్ మీడియాల్లో పంచుకుంది. ఈ పుట్టినరోజు ఎవెలిన్ శర్మకు చాలా స్పెషల్. భర్త తుషాన్ భిండితో కలిసి తన మొదటి బిడ్డను ఆశిస్తున్నందున ఇది చాలా చాలా ప్రత్యేకమైనది.

కేక్ కటింగ్ ఫోటోతో ఈవెలిన్ ఆసక్తికర వ్యాఖ్యను జోడించింది. “మమ్మీ హ్యాపీ.. బేబీ హ్యాపీ .. నేను ఈ కేకును తయారు చేయడానికి 6 గంటలు పట్టింది. నా అభిమాన జర్మన్ కేక్ ఊరిస్తోంది“ అంటూ ఈవెలిన్ వ్యాఖ్యానించింది. ఎవెలిన్ తనను తాను మైమరిచి కేక్ వైపే ఆరాధనగా చూస్తున్న అందమైన ఫోటోలు వైరల్ గా మారాయి.

ఎవెలిన్ శర్మ ఇంతకుముందు తన ఇన్ స్టాగ్రామ్ లో బేబి బంప్ ఫోటోని షేర్ చేయగా అది వైరల్ గా మారింది. “నిన్ను నా చేతుల్లో పట్టుకోవటానికి వేచి ఉండలేను…“ అంటూ స్విమ్సూట్ లో ఒక చైస్ లాంజ్ పై రిలాక్స్ అవుతూ.. బేబి బంప్ పై చేతిని ఉంచింది. చంద్రమండలానికి వెళ్లినంత ఆనందంగా ఉందని ప్రపంచదేశాల్లో ఉన్న తనవారందరికీ బేబీని చూపిస్తానని ఆనందం వ్యక్తం చేసింది. ఎలి అవ్రమ్ ఈ ఫోటోలకు స్పందిస్తూ.. ప్రెట్టీయెస్ట్ మమ్మీ! అన్న వ్యాఖ్యను జోడించింది. నీల్ నితిన్ ముఖేష్ వ్యాఖ్యానిస్తూ.. నా ప్రియమైన అమ్మాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. మంచి ఆహారం తీసుకోండి అని వ్యాఖ్యను జోడించారు.

ఏడాది క్రిందట నిశ్చితార్థం చేసుకున్న తర్వాత మే 15 న ఆస్ట్రేలియా-బ్రిస్బేన్ లో తుషాన్ భిండిని జర్మన్ బ్యూటీ ఎవెలిన్ శర్మ పెళ్లాడారు. అందుకు సంబంధించిన ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. #frankfurtertorte #birthdaygirl #photodump పేరుతో ఈవెలిన్ ఈ ఫోటోలను షేర్ చేయగా.. పరిశ్రమకు చెందిన అభిమానులు స్నేహితులు వాటిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.