Templates by BIGtheme NET
Home >> Cinema News >> ప్రభాస్‌ సరసన సాయిపల్లవి.. డార్లింగ్ ఇచ్చిన హింట్‌తో ఫ్యాన్స్ ఖుషీ!

ప్రభాస్‌ సరసన సాయిపల్లవి.. డార్లింగ్ ఇచ్చిన హింట్‌తో ఫ్యాన్స్ ఖుషీ!


టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్లో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించడంతో పాటు వింతగానూ అనిపిస్తాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు సంబంధించి ఓ న్యూస్ టాలీవుడ్‌లో అలాంటి పరిస్థితినే క్రియేట్ చేస్తోంది. ఇంతకీ ఆ న్యూస్ ఏంటో తెలుసా.. ప్రభాస్‌ పక్కన సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోందట. నిజంగా ఈ కాంబినేషన్ సెట్ అవుతోందో లేదో తెలియదు గానీ ఫిల్మ్‌నగర్‌లో మాత్రం హాట్‌టాపిక్‌గా మారింది. హైట్ ప్రాబ్రమ్‌ లేకపోతే సాయిపల్లవి తన పక్కన పక్కాగా సూటవుతుందని ప్రభాస్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడీ ప్రచారానికి నాంది పలికాయి.

అయితే ప్రభాస్‌తో ‘సలార్’ తెరకెక్కించనున్న కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్.. సరిగ్గా ఈ పాయింట్ మీదే ఫోకస్ పెట్టాడట. ఈ సినిమాలో నటించబోయే ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా సాయిపల్లవిని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో సాయిపల్లవి నటించబోయే తొలి పాన్ ఇండియా సినిమా ఇదేనంటూ అప్పుడే ప్రచారం మొదలైంది. తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్న సాయిపల్లవి ఇప్పడు హీరోలకు మోస్ట్ ఫేవరెట్‌గా మారింది. అందుకే ఈ అమ్మడు రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచినట్లు ఇటీవలే వార్తలొచ్చాయి. పవన్ నటించబోయే మలయాళ రీమేక్ సినిమా కోసం సంప్రదిస్తే ఏకంగా రూ.2కోట్లు డిమాండ్ చేసిందట. టాలీవుడ్లో హైబ్రిడ్ పిల్ల హవా అలా నడుస్తోంది మరి.