Templates by BIGtheme NET
Home >> Cinema News >> సమంత మరీ అంత డిమాండ్ చేసిందా..??

సమంత మరీ అంత డిమాండ్ చేసిందా..??


Samantha Demanded A huge Remunaration For a Movie

Samantha Demanded A huge Remunaration For a Movie

స్టార్ హీరోయిన్ సమంత గురించి సౌత్ ఇండియన్ సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. పెళ్లి తర్వాత కూడా మంచి విజయాలతో ఫామ్ లో ఉన్న ఈ భామ ఫిట్నెస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని అందరికి తెలిసిన విషయమే. అయితే ఆమె చివరిగా నటించిన ‘ఓ బేబీ’ సినిమా తరువాత సమంతకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగిందని చెప్పాలి. ఇంతవరకు సమంత తరువాత ప్రాజెక్టు ఏంటో.. ఎవరికి క్లారిటీ లేదు. కానీ సమంత ఏం చేసినా సోషల్ మీడియాలో మాత్రం సంచలనమే అవుతోంది. లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయిన సమంత సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది. తరచు ఫిట్నెస్ కి సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఫోటోలు వీడియోలు పోస్ట్ చేస్తుంది. ఇక ఇంటివద్ద ఉంటూనే సమంత కొత్త సినిమాల కోసం స్క్రిప్టులు కూడా వింటుందట. బాక్సాఫీస్ వద్ద సమంత సక్సెస్ రేట్ బాగానే ఉంది. అయితే ప్రస్తుతం దర్శక నిర్మాతలతో స్టోరీ డిస్కషన్స్ నడుస్తున్నాయట.

సమంతతో ఓ బ్లాక్ బస్టర్ రూపొందించిన ఓ ప్రొడక్షన్ హౌస్ ఓ స్క్రిప్ట్ తో ఆమెను సంప్రదించారట. ఇక ఆ స్క్రిప్ట్ సమంతకు నచ్చడంతో చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాకోసం సమంత 3.5 కోట్ల పారితోషికం అడిగిందని సమాచారం. ఇక ఆమె అంత భారీ మొత్తం అడగటంతో నిర్మాత షాక్ తిన్నాడట. ఇక సమంత విషయంలో వారు క్లారిటీగా లేరని మాత్రం అర్ధమవుతుంది. సమంతకు అంత ముట్టజెప్పే బదులు వేరే హీరోయిన్ని వెతికే పనిలో పడ్డారట ప్రొడ్యూసర్. ఇదిలా ఉండగా.. సోనీ పిక్చర్స్ నిర్మించనున్న ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై సంతకం చేసింది సమంత. ఈ సినిమాకు అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించనున్నారు. అలాగే విజయ్ సేతుపతి నయనతారలతో కలిసి విఘ్నేష్ శివన్ సినిమా కూడా చేస్తుంది. ఇవేగాక సమంత “ది ఫ్యామిలీ మ్యాన్: సీజన్ 2” వెబ్ సిరీస్ తో డిజిటల్ ప్లాట్ ఫామ్ పై కూడా అడుగుపెట్టనుంది. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లను సిద్ధం చేసుకునే పనిలో ఉంది సామ్.