‘ఐకానిక్ కపుల్’గా రికార్డు సృష్టించిన విరాట్-అనుష్క..

0

Virat Anushka who created a record as  Iconic Couple

Virat Anushka who created a record as Iconic Couple

బాలీవుడ్ ఇండస్ట్రీలో అనుష్క శర్మ అంతర్జాతీయ క్రికెట్ టీమ్ లో విరాట్ కోహ్లీ ఇద్దరు స్పెషలే. ఎందుకంటే వారిద్దరూ ఎక్కడ కనిపించినా సందడిగానే ఉంటుంది. నిజానికి అనుష్క ఫ్యాషన్ అండ్ సినీరంగం.. కానీ విరాట్ పూర్తి భిన్నం క్రికెట్ ఫీల్డ్. ఇద్దరూ వాళ్ల రంగాలలో మేటి. కానీ ఏమాత్రం పొంతన లేని వారిద్దరిని కలిపింది మాత్రం స్వచ్ఛమైన ప్రేమ. ఇద్దరు ఈరోజు స్టార్లుగా వెలిగిపోతున్నారు. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ.. వాళ్ల వృత్తులను గౌరవించుకుంటున్నారు అంటే అది ప్రేమ వల్లే. మాములుగా సెలబ్రిటీలకు పెళ్లిళ్లు అయితే కనీసం అయిదారు నెలల పాటు ఇద్దరు హనీమూన్ అని.. అదని ఇదని ఎంజాయ్ చేస్తారు. కానీ అనుష్క విరాట్ కోహ్లీలు మాత్రం అందుకు భిన్నంగా ఎంజాయ్ చేశారట.

పెళ్లయిన మొదటి ఆరు నెలల వరకు ఇద్దరు కలవడమే గగనంలా మారిందట. ఈ విషయం స్వయంగా అనుష్క శర్మ బయట పెట్టింది. ఇక సోషల్ మీడియాలో విరుష్క జంటకు ఉన్న క్రేజ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఇన్స్టాగ్రామ్ పాపులర్ సిరీస్ ‘టేక్ ఏ బ్రేక్’లో కనిపించిన తొలి భారతీయులుగా రికార్డు సృష్టించారు. ఇంస్టాగ్రామ్ వేదికగా నిర్వహించే ఈ సిరీస్కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. అంతేకాక మార్క్ జుకర్బర్గ్ నిర్వహణలో ఉన్న ఇన్స్టాగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా కేవలం 59 ఐకానిక్ పర్సనాలిటీలను ఫాలో అవుతుండగా.. వారిలో తాజాగా విరష్క దంపతులు కూడా చేరారట. భారత్ నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక కపుల్గా విరుష్కలు రికార్డు నెలకొల్పారు.

సెలెనా గోమెజ్ మిలే సైరస్ నవోమి కాంప్బెల్ వంటి గ్లోబల్ ఐకాన్ల పక్కన చోటు సంపాదించుకున్నారు. ఈ ‘టేక్ ఏ బ్రేక్’ సిరీస్లో యూత్ ఐకాన్లుగా నిలిచే వారి వ్యక్తిగత జీవితాల గురించి పలు విషయాలను బయట పెడతారు. ఇందులో విరాట్ అనుష్కలు ఇద్దరు కూడా వారి వారి వ్యక్తిగత విషయాలు వాటి వృత్తుల గురించి.. అలాగే ఇష్టాయిష్టాల గురించి మాట్లాడారు. అయితే వీరి వీడియో కేవలం ఒకరోజులోనే 150మిలియన్ల మంది వీక్షించినట్లు సమాచారం. ఇక విరుష్క జోడీ 2013లో ఓ షాంపూ ప్రకటన కోసం చేసిన చిత్రీకరణలో మొదటిసారి కలుసుకున్నారట. ఆ తర్వాత నాలుగేళ్ల పాటు లవ్ లైఫ్ గడిపి 2017లో డిసెంబర్ 11న ఇటలీలో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా దాంపత్య జీవితం ఎంజాయ్ చేస్తున్నారట.