యుగపురుషునికి, ఆయన ఆశేష ఆభిమానులకు 99వ జన్మదిన, శత వసంతోత్సవ శుభాకాంక్షలు,Click for NTR Rare Pics.

Samantha Ruth Prabhu : నటి సమంత ఎన్ని వందల కోట్లు సంపాదించారో తెలుసా..

0

Samantha Ruth Prabhu : సమంత (Samantha Ruth Prabhu) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సమంత తెలుగులో ‘ఏమాయ చేశావే’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైయారు. అయితే నాలుగేళ్ల తర్వాత ఇటీవల ఆమె (Divorce with Naga Chaitanya) నాగ చైతన్యకు విడాకులు ఇచ్చి అందరికి షాక్ ఇచ్చారు.

ఇక అది అలా ఉంటే సమంత ఆస్తుల గురించి మరోసారి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆమె ఆస్తులు ఎన్ని కోట్లకు ఉంటాయి.. ఒక్కో సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారు అంటూ చర్చించుకుంటున్నారు నెటిజన్స్. అయితే తెలుస్తోన్న సమాచారం మేరకు సమంత ఒక్కో సినిమాకు రెండు నుండి మూడు కోట్లు తీసుకుంటుందని అంటున్నారు. అంతేకాదు సమంత తన పదేళ్ల కెరీర్ లో మొత్తం రూ.100 కోట్లు విలువ చేసే ఆస్తులు సంపాదించిందని టాక్. 

ఓ వైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు యాడ్స్, వెబ్ సిరీస్‌లు చేస్తూ సమంత అదరగొడుతున్నారు. సమంతకు సొంతంగా రెండు బిజినెస్‌లు కూడా ఉన్నాయి. ఒకటి ఫ్యాషన్ లేబుల్ సాకి కాగా.. మరొకటి ఎకాం అనే ప్రీ స్కూల్. పిల్లలకు వినూత్నంగా విద్యను అందించే లక్ష్యంతో కొన్ని సంస్థలతో కలిసి ఈ సంస్థను మొదలుపెట్టారు. వీటితో పాటు సమంతకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఒక విలాసవంతమైన ఇల్లుతో పాటు రెండు కోట్లు విలువ చేసే బీఎండబ్ల్యూ కార్లు రెండు ఉన్నాయని తెలుస్తోంది. అలానే ఒక జాగ్వార్ కారు కూడా ఉంది. అయితే ఇవన్నీ కూడా సమంత సొంతంగా సంపాదించుకున్న ఆస్తులే. 

ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.., ఆమె నయనతార కలిసి నటించిన తాజా చిత్రం కాతు వాకుల రెండు కాదల్ (Kaathu Vaakula Rendu Kaadhal). ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 28న విడుదలై ఓకే అనిపించుకుంది. ఈ చిత్రానికి నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి హీరోగా నటించారు. ఈ చిత్రం తెలుగులో కణ్మణి రాంబో ఖతీజాగా (Kanmani Rambo Khatija) డబ్ చేశారు. తెలుగులో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకు తెలుగులో ప్రమోషన్స్ సరిగా చేయలేకపోవడంతో ఎప్పుడు వచ్చిందో కూడా తెలియకుండా థియేటర్స్ నుంచి వెళ్లి పోయింది. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించారు.