మూగ జీవుల ప్రేమకు ఫిదా అయిన సమంత

0

తమిళనాడులోని పలమేడుకు చెందిన ఒక రైతు వద్ద ఆవు ఎద్దు చాలా కాలంగా ఉంటున్నాయి. ఆవు కొన్నాళ్లుగా సరిగా పని చేయలేక పోతున్న కారణంగా దాన్ని అమ్మేసి కొత్త ఆవు లేదా ఎద్దు కొనుగోలు చేయాలనుకున్నాడట. ఆ ఆవును అమ్మేసేందుకు వాహనంలో ఎక్కించాడు. ఆవును ఎక్కడికో తీసుకు వెళ్తున్నట్లుగా గుర్తించిన ఎద్దు వాహనంను వెంబడించింది. వాహనంకు అడ్డుగా నిలిచింది. డ్రైవర్ వద్దకు వెళ్లి జాలిగా చూసింది. ఈ మొత్తం వ్యవహారం వీడియో తీసి కొందరు సోషల్ మీడియాలో పెట్టారు.

జూన్ నెలలో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అప్పుడు చూడలేదో లేక మరేంటో కాని సమంత ఇప్పుడు ఆ వీడియోకు స్పందించింది. వీడియోను రీ ట్వీట్ చేసి హార్ట్ సింబల్ ను పోస్ట్ చేసింది. ఒక్క లవ్ సింబల్ తో సమంత తాను చెప్పాలనుకున్నది చెప్పేసింది. ఆ మూగ జీవుల మద్య ఉన్న అన్యోన్యం మరియు ఆప్యాయత ఎలాంటిదో వీడియో చూస్తుంటే అర్థం అవుతుంది. మనసున్న ఏ ఒక్కరు అయినా ఖచ్చితంగా వీడియోకు కదిలి పోవాల్సిందే. సమంత కూడా కదిలి పోయి ప్రేమకు చిహ్నం అంటూ హార్ట్ సింబల్ ను పోస్ట్ చేసింది. సమంత రీ ట్వీట్ వల్ల మళ్లీ ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

True love still exists❤️❤️❤️
Touching story from India