మా ఈగోకు కారణం ఇదేనంటున్న సమంత

0

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొత్త కొత్త రంగాల్లో అడుగు పెడుతుంది. పెళ్లి తర్వాత సినిమాల సంఖ్య కాస్త తగ్గించినట్లుగా అనిపించినా ప్రేక్షకులకు మరింతగా ఈమె చేరువ అవుతోంది. ఒక వైపు వెబ్ సిరీస్ లో నటిస్తోంది.. మరో వైపు వస్త్ర బిజినెస్ లో అడుగు పెట్టింది.. మరో వైపు ఒక ఓటీటీ కోసం టాక్ షో చేసింది. ఇటీవలే బిగ్ బాస్ వంటి వరల్డ్ బిగ్గెస్ట్ షో కు ఒక్క ఎపిసోడ్ కు హోస్ట్ గా కూడా చేసింది. ఇన్ని రకాలుగా ప్రేక్షకులకు దగ్గరగా ఉంటున్న సమంత తాజాగా ఆహా ప్రెస్ మీట్ లో పాల్గొంది. ఆ సందర్బంగా సామ్ జామ్ టాక్ షోను అనౌన్స్ చేశారు. ఆ సందర్బంగా సమంత అతి పెద్ద కటౌట్ ను ఆవిష్కరించారు.

ఆహా అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఆ వీడియోను షేర్ చేశారు. అతి పెద్ద కటౌట్ తో సమంత ఆశ్చర్య పోయింది. వీడియోలో ఆమె ఫీలింగ్ ను క్లీయర్ గా చూడవచ్చు. ఆమె ఆనందంకు అవధులు లేకుండా ఉంది. ట్విట్టర్ లో ఆహా షేర్ చేసిన వీడియోను రీ ట్వీట్ చేసి స్టార్స్ కు ఇందుకే ఈగో ఉంటుంది అంటూ స్మైలీ ఈమోజీని షేర్ చేసింది. ఇంత పెద్ద కటౌట్ లు ఏర్పాటు చేస్తే ఈగో ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అనేది సమంత అభిప్రాయం అయ్యి ఉంటుంది అంటూ నెటజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అంత పెద్ద స్టార్ అయినప్పుడు ఆమాత్రం ఈగో లేకుంటే ఎలా అంటూ మరి కొందరు కూడా అంటున్నారు. మొత్తానికి సమంత కటౌట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. స్టార్ హీరోలకు సైతం అంత పెద్ద కటౌట్ ఈమద్య కాలంలో ఏర్పాటు చేయలేదు. సమంతకు ఆ ఘనత దక్కింది. సమంత టాక్ షో ఆహాలో ఈనెల 13 నుండి స్ట్రీమింగ్ అవ్వబోతున్న విషయం తెల్సిందే.