మళ్లీ అతడిపై ప్రేమను బయట పెట్టిన టెండూల్కర్ డాటర్

0

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఇద్దరు పిల్లలు కూడా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా సందడి చేస్తూ ఉంటారు. వీరిద్దరి గురించి జాతీయ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. కొన్ని రోజుల క్రితం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ మరియు యువ టీం ఇండియా క్రికెటర్ శుభమన్ గిల్ రిలేషన్ లో ఉన్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఇద్దరు కూడా ఒకే సమయంలో ఒకే విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇద్దరు కూడా ప్రేమలో ఉన్నట్లుగా జాతీయ మీడియాలో సైతం కథనాలు వచ్చాయి. ఆ విషయంలో సారా కాని శుభమన్ కాని స్పందించలేదు. ప్రస్తుతం శుభమన్ ఐపీఎల్ లో అదరగొడుతున్నాడు.

అక్కడ శుభమన్ ఐపీఎల్ లో మంచి ఫామ్ ను కనబర్చుతున్న కారణంగానో లేదా మరేంటో కాని సోషల్ మీడియాలో హార్ట్ సింబల్ ను షేర్ చేసింది. అది ఖచ్చితంగా శుభమన్ గిల్ గురించే అయ్యి ఉంటుందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరి మద్య మంచి రిలేషన్ కొనసాగుతుందని.. ముందు ముందు ఇద్దరు తమ రిలేషన్ ను మరింత ముందుకు తీసుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ ప్రముఖ జాతీయ మీడియాలో కథనం వచ్చింది. సచిన్ టెండూల్కర్ వీరి ప్రేమ విషయంలో ఎలా స్పందిస్తారు అనేది ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఆయన కూతురు విషయంలో స్పందించలేదు. టీం ఇండియాలో మంచి ఆటగాడిగా పేరు దక్కించుకుంటే సారా టెండూల్కర్ తో అతడి బందం మరింత బలపడే అవకాశం ఉందంటున్నారు.