#ఎన్టీఆర్ 30..ముందుంది ముసళ్ల పండగ

0

కొన్నిటి విషయంలో గుంభనగా ఉండేందుకే మేకర్స్ ఇష్టపడతారు. ముఖ్యంగా ఎవరైనా అగ్ర హీరో సినిమా గురించి లీకులిచ్చేందుకు ఏమాత్రం ఆసక్తిని కనబరచరు. అలా ఎగ్జయిట్ చేస్తుంటే ఫ్యాన్స్ లో కూడా ఆ క్యూరియాసిటీ అంతకంతకు రైజ్ అవుతుంటుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ విషయంలోనూ నిర్మాతలు అలానే సీక్రెట్ మెయింటెయిన్ చేస్తున్నారు. రహస్యం ఏదీ లీక్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు.

ఈ చిత్రానికి `అయినను పోయి రావలె హస్తినకు` అనే టైటిల్ పరిశీలనలో ఉంది. కనీసం ఈ టైటిల్ ని అయినా బయటపెట్టరా? అంటూ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేతను ప్రశ్నిస్తే ససేమిరా అనేస్తున్నారు. తమకు ముందే టైటిల్ చెప్పే అలవాటు లేదని .. సెంటిమెంటు ప్రకారం.. ఒకసారి సినిమా మొదలెట్టాక టైటిల్ ప్రకటిస్తామని చెబుతున్నారు.

సోషల్ మీడియాల్లో ప్రచారంలో ఉన్న టైటిలేనా? అన్నది క్లారిటీ ఇవ్వలేదు. సహ నిర్మాత నాగ వంశీ చివరకు ఈ చిత్రం గురించి మాట్లాడుతూ..“మా యంగ్ టైగర్ తారక్ అన్న అభిమానులకు మా స్పందన ఏమంటే.. షూటింగ్ ప్రారంభించాక ప్రతిదీ వెల్లడిస్తాం. దీనికి ముందు టైటిల్ను బహిర్గతం చేయకూడదనే సెంటిమెంట్ మాకు ఉంది. ఈ సమయంలో మమ్మల్ని నమ్మండి. చాలా పెద్ద సంగతి మీకు తెలుస్తుంది“ అని అన్నారు. అరవింద సమేత తర్వాత త్రివిక్రమ్ -ఎన్టీఆర్- హారిక కాంబినేషన్ లో రెండో చిత్రమిది. ఎస్ రాధా కృష్ణ నిర్మాత కాగా.. నాగ వంశీ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తారు. ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణ పూర్తి చేసుకుని ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగును ప్రారంభిస్తారు.