పవన్ బర్త్ డేకి.. కరోనా సేవలే కీలక ఎజెండా

0

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే స్పెషల్ ఏమిటి? సెప్టెంబర్ 2న బర్త్ డే సందర్భంగా పవన్ అభిమానులు ఎలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు? ఫ్యాన్స్ కి పవన్ ఎలాంటి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? అంటూ ఆసక్తిగా ముచ్చటించుకుంటున్నారంతా. ఇంతకీ ఈసారి పవన్ బర్త్ డే స్పెషల్ ఏమిటి? అంటే..

సెప్టెంబర్ 2న పవన్ నుంచి వరుసగా కొత్త సినిమాల ప్రకటన లు ఉంటాయని ఇప్పటికే ప్రచారం సాగి పోతోంది. అయితే ఆరోజు మాత్రం పవన్ ఎంతో డీసెంట్ గా ఎలాంటి సినిమా ప్రకటనలు లేకుండా జాగ్రత్త పడనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కొత్త ఎనౌన్సమెంట్స్ ఇచ్చి తాను చేయాలనుకున్న సేవాకార్యక్రమాలు పక్కకు వెళ్లి పోకుండా జాగ్రత్త పడుతున్నారట. ఆరోజు ఏపీలో కరోనా హాస్పిటల్స్ కి ఆక్సిజన్ వెంటిలేటర్లు వితరణ కార్యక్రమాన్ని డైవెర్ట్ చేయకూడదని తన నిర్మాతలకు క్లియర్ కట్ గా చెప్పారట పవన్.

తాను రాజకీయంగా తలపెట్టదలుచుకున్న ఏ కార్యక్రమానికి కూడా విఘాతం కలగ కూడదన్న పంతం జనసేనానిలో ఉందట. ఇక సేవాకార్యక్రమాలు చేయడంలో అన్న చిరంజీవిని తమ్ముడు కూడా అనుసరిస్తున్నారని తెలుస్తోంది. ఏపీ రాజకీయాల్లో మునుముందు క్రియాశీలక పాత్రను పవన్ పోషించనున్నారు. ఇక ఆక్సిజన్ వెంటిలేటర్లు భాజపా స్నేహితుల సిఫార్సుతో పీఎం మోదీ పంపించారని జరుగుతున్న ప్రచారం సాగుతోంది. కానీ ఇలాంటి ప్రచారాలేవీ పవన్ పట్టించుకోకుండా సేవాకార్యక్రమాల్లో ఎక్కడా తగ్గకూడదని భావిస్తున్నారట.

అలాగే పవన్ నుంచి పలు సినిమా ప్రకటనలు ఉంటాయని ఇప్పటికే ప్రచారం సాగుతున్నా దానికి ఆస్కారం లేదని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి మూవీ కాన్ఫామ్ అయ్యింది. రామ్ తళ్లూరి నిర్మించే ఈ సినిమాకోసం వక్కంతం వంశీ రచయితగా కొనసాగుతారు. దసరా రోజున పూజా కార్యక్రమాలతో ఈ సినిమా మొదలవుతుందట. ఇప్పటికే హీరో దర్శకులకు అడ్వాన్సులు ముట్టాయన్న ప్రచారం సాగుతోంది.