శీనయ్య ఇంకా లైన్ లో ఉన్నాడట

0

యాక్షన్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్ ఈమద్య కాలంలో కాస్త జోరు తగ్గడంతో నటుడిగా మారేందుకు ప్రయత్నించాడు. మొదటి సినిమా శీనయ్యను మొదలు పెట్టి చాలా కాలం అయ్యింది. దిల్ రాజు బ్యానర్ లో నరసింహ రావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను కొన్ని కారణాల వల్ల ఆపేశారు. దాంతో సినిమా మళ్లీ పట్టాలెక్కడం కష్టమే అంటూ వార్తలు వచ్చాయి. అయితే శీనయ్య సినిమా పై ఇంకా వర్క్ చేస్తున్నట్లుగా దర్శకుడు నరసింహ రావు క్లారిటీ ఇచ్చాడు. ఈ లాక్ డౌన్ టైం లో స్ట్రిప్ట్ పై చర్చలు జరిపామని ఆయన అన్నాడు.

నిర్మాతగా దిల్ రాజుకు ఈ స్థాయి రావడానికి కారణం వినాయక్ కూడా ఒకరు. అందుకే ఆయన కోసం శీనయ్య సినిమాను దిల్ రాజు భుజాలపై వేసుకున్నాడు. ఖచ్చితంగా శీనయ్య సినిమాను పూర్తి చేసి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరివేక్షిస్తున్నాడు. త్వరలో షూటింగ్ ను ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేశారనే వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు మొదటి నుండి షురూ చేస్తారా బ్యాలన్స్ వర్క్ పూర్తి చేయనున్నారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి అయితే శీనయ్య ఇంకా లైన్ లోనే ఉన్నాడు అనే విషయమై క్లారిటీ వచ్చేసింది.