హొయలు చూపి ఆహా అనిపిస్తున్న సీరత్ కపూర్!!

0

2014లో శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ‘రన్ రాజా రన్’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది హీరోయిన్ సీరత్ కపూర్. అసిస్టెంట్ కొరియోగ్రాఫరుగా కెరీర్ ప్రారంభించినా ఈ ముంబై భామ.. అదే ఏడాది ‘జిద్’ అనే రొమాంటిక్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. రాక్ స్టార్ సినిమాకి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పనిచేసిన ఈ అమ్మడిని డైరెక్టర్ సుజిత్ టాలీవుడ్ ఇండస్ట్రీకి తీసుకొచ్చాడు. ఫస్ట్ సినిమాతోనే మంచి ఇంప్రెషన్ కొట్టేసిన ఈ భామ.. వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది. రన్ రాజా రన్ సినిమా తర్వాత టైగర్ కొలంబస్ లాంటి సినిమాలు చేసింది సీరత్. కానీ సినిమాలకు మంచి పేరు వచ్చినా ఈ భామకి మాత్రం గుర్తింపు రాలేదు.

ఆ తర్వాత 2017లో కింగ్ నాగార్జునతో ‘రాజుగారిగది 2’ అలాగే అల్లుశిరీష్ నటించిన ‘ఒక్కక్షణం’ సినిమాలతో పాటు మాస్ రాజా రవితేజ సరసన ‘టచ్ చేసి చూడు’ సినిమాలో నటించింది. కానీ ఏ సినిమా కూడా అమ్మడికి సరైన బ్రేక్ ఇవ్వలేక పోయాయి. కానీ సీరత్ తన ఫస్ట్ మూవీ నుండి కూడా అందాల ఆరబోతలో ఎక్కడ తగ్గలేదు. సీరత్ నటించిన అన్నీ సినిమాలో గ్లామర్ షో మినిమమ్ గ్యారంటీ. రాజుగారిగది-2 సినిమాలో ఏకంగా బికినీ వేసి కుర్రకారు మనసు దోచుకుంది. సీరత్ ఎంతగా గ్లామర్ షో చేసినా హిట్స్ మాత్రం రావట్లేదు. నిజానికి ఈ భామ కూడా మూవీ సెలక్షన్స్ లో వీక్ అని అనుకోక తప్పేలా లేదంటున్నారు. సినిమాల విషయం పక్కన పెడితే అమ్మడు ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.

ఈ వయ్యారి అందాలకు నెట్టింట సెగలు రేగుతున్నాయి. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ కలిగిన ఈ ముద్దుగుమ్మ.. లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయింది. ఇక చేసేదేం లేక ఫోటోషూట్స్ తో చిచ్చు రేపుతోంది. తాజాగా సీరత్ ఓ పిక్ షేర్ చేసింది. ఆ ఫోటోలో బెడ్ పై పడుకొని ఆలోచిస్తున్న పోజులో ఉంది. బూడిద కలర్ స్కిన్ టైట్ డ్రెస్ లో అమ్మడి అందాలు ఫుల్ గా కవర్ చేసింది. కానీ గ్లామర్ ప్రియులకు కావాల్సిన హొయలు క్లియర్ గా కనబడేలా ఉంచింది. ఆ పిక్ చూస్తూ నెటిజన్లు ఆహా అంటున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవలే ‘కృష్ణ అండ్ హిస్ లీల’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో అమ్మడి క్యారెక్టర్ నటనకి మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ‘మా వింత గాథ వినుమా’ అనే సినిమాలో నటిస్తోంది. అయితే ఈ కొత్త సినిమా తన కెరీర్ మారుస్తుందని ఆశిస్తుంది.