స్కూల్ డ్రస్ లో పవన్ అత్త

0

ఈ మద్య కాలంలో సోషల్ మీడియాలో థ్రూ బ్యాక్ ఫొటోస్ అంటూ చాలా మంది స్టార్స్ వారి వారి పాత ఫొటోలను షేర్ చేస్తున్నారు. ఇప్పటికి అప్పటికి ఎంత తేడానో చూపిస్తూ సరదాగా వారు షేర్ చేస్తున్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈసారి సీనియర్ స్టార్ నటి నదియా వంతు వచ్చింది. 1980 మరియు 1990ల్లో తమిళ మరియు తెలుగులో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన నదియా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఈమె ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ ఫొటో వైరల్ అవుతోంది.

1986 సంవత్సరంలో ఈమె తమిళంలో సురేష్ తో కలిసి నటించిన ‘పూకలై పరికత్రికల్’ సినిమాలో ఈమె నటించింది. ఆ సినిమాలో స్కూల్ డ్రస్ లో నదియా కనిపించింది. అప్పటి లేడీ సైకిల్ తో స్కూల్ యూనిఫామ్ లో నదియా ను చూస్తుంటే వావ్ అన్నట్లు గా ఉంది. అప్పటికి ఇప్పటికి మొహం లో ఎలాంటి మార్పు రాలేదని అయితే కాస్త పర్సనాలిటీ లో మర్పు వచ్చినట్లు గా అనిపిస్తుందని నెటజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అత్తారింటికి దారేది చిత్రంతో తెలుగు లో క్యారెక్టర్ ఆర్టిస్టు గా రీ ఎంట్రీ ఇచ్చిన నదియా ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించింది.