దర్శకుడు ఎన్ బీ చక్రవర్తి కన్నుమూత…!

0

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ సీనియర్ దర్శకుడు ఎన్ బీ చక్రవర్తి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. ఎన్ బీ చక్రవర్తి తెలుగులో శోభన్ బాబు – నందమూరి బాలకృష్ణ – రాజేంద్రప్రసాద్ – రాజశేఖర్ లతో వర్క్ చేసారు. శోభన్ బాబుతో ‘సంపూర్ణ ప్రేమాయణం’.. బాలకృష్ణతో ‘కత్తుల కొండయ్య’ మరియు ‘నిప్పులాంటి మనిషి’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు చక్రవర్తి. వీటితో పాటు రాజేంద్రప్రసాద్ – భానుప్రియ – రాజశేఖర్ – శరత్ బాబు కీలక పాత్రల్లో నటించిన ‘కాష్మోరా’ చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. కాగా దర్శకుడు ఎన్ బి చక్రవర్తి అనారోగ్యంతో శుక్రవారం ఉదయం కన్నుమూశారని సూపర్ హిట్ మ్యాగజైన్ అధినేత బిఎ రాజు తెలిపారు. చక్రవర్తి మృతికి పలువురు సినీ ప్రముఖలు సంతాంపం వ్యక్తం చేస్తున్నారు.