నాగార్జున బర్త్ డే గిఫ్ట్ అదేనా?

0

ఈనెలలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజులతో పాటు కింగ్ నాగార్జున పుట్టిన రోజు కూడా ఉన్న విషయం తెల్సిందే. చిరంజీవి బర్త్ డేకు ఆచార్య నుండి ఫస్ట్ లుక్ రాబోతుంది. మహేష్ బాబు పుట్టిన రోజుకు సర్కారు వారి పాట చిత్రంకు సంబంధించి ఒక పాటను విడుదల చేయబోతున్నారు. ఇక నాగార్జున బర్త్ డే రోజు ఏం రాబోతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో అక్కినేని ఫ్యాన్స్ కోసం ఆయన కొత్త సినిమా టీజర్ రాబోతుందనే అనధికారిక ప్రకటన వచ్చేసింది.

నాగార్జున ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. సాల్మన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఈనెల 29న నాగార్జున బర్త్ డే సందర్బంగా వైల్డ్ డాగ్ టీజర్ ను విడుదల చేయాబోతున్నారట. ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది కనుక టీజర్ తో అక్కినేని ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ఈ సినిమా కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయింది. ప్రస్తుత పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత షూటింగ్ ను మొదలు పెట్టే అవకాశం ఉంది.

మరో వైపు నాగార్జున బిగ్ బాస్ సీజన్ 4 కు సిద్దం అయ్యాడు. తెలుగులో ఇప్పటి వరకు మూడు సీజన్ లు ప్రసారం అవ్వగా మూడు సీజన్ లకు ముగ్గురు హోస్ట్ లు వ్యవహరించారు. ఎన్టీఆర్ నానిలు ఒక్కో సీజన్ కు హోస్టింగ్ చేయగా నాగార్జున మాత్రం తన రెండవ సీజన్ కు హోస్టింగ్ కు సిద్దం అయ్యాడు. ఆగస్టు 30వ తారీకు నుండి ఈ బిగ్ బాస్ సీజన్ ప్రారంభం కాబోతుంది. అంటే నాగ్ బర్త్ డే రోజున షూటింగ్ జరుగనుందన్నమాట.