సుప్రింకోర్టు సీజేపై సంచలన ఆరోపణలు

0

సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఏఎస్ బాబ్డేపై ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ సంచలన ఆరోపణలు చేశారు. బాబ్డేపై ఆరోపణలు చేస్తు ప్రశాంత్ ట్విట్వర్ వేదికగా చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రం అందించిన హెలికాప్టర్ సౌకర్యాన్ని బాబ్డే ఎలా ఉపయోగించుకుంటారంటూ లాయర్ నిలదీశారు. లాయర్ ట్వీట్ ప్రకారం ఈమధ్య చీఫ్ జస్టిస్ బాబ్డే మధ్యప్రదేశ్ కు వెళ్ళారట.

అక్కడి వైల్డ్ లైఫ్ శాంక్చురినీ చూడటానిక సీజేకి ప్రభుత్వం హెలికాప్టర్ ఏర్పాటు చేసిందట. అలాగే శాంక్చురీ చూసిన తర్వాత సొంత ప్రాంతమైన నాగ్ పూర్ కు వెళ్ళటానికి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెలికాప్టర్లోనే బాబ్డే ప్రయాణం చేశారట. బాబ్డేకి ప్రభుత్వం హెలికాప్టర్ ఏర్పాటు చేయటం ఏమిటి ? ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఆ సౌకర్యాన్ని బాబ్డే ఎలా ఉపయోగించుకుంటారంటూ ప్రశాంత్ ప్రశ్నించారు.

ఇంతకీ ప్రశాంత్ లేవనెత్తిన అభ్యంతరాలు ఏమిటంటే తొందరలోనే మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ఓ కీలకమైన కేసు బాబ్డే ముందుకు వస్తోందట. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చేసిన విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ తరపున గెలిచిన 22 మంది ఎంఎల్ఏలు బీజేపీలోకి ఫిరాయించటంతో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది. వెంటనే ఆ 22 మంది ఎంఎల్ఏల మద్దతుతో బీజేపీ అధికారంలోకి వచ్చింది.

అయితే పార్టీ ఫిరాయించిన ఎంఎల్ఏలపై అనర్హత వేటు వేయాలంటూ కాంగ్రెస్ పార్టీ సుప్రింకోర్టులో పిటీషన్ వేసింది. ఇపుడా కేసే సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే ముందుకే వస్తోందట. ప్రశాంత్ ఆరోపణల ప్రకారం మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం భవిష్యత్తు బాబ్డే మీదే ఆధారపడుంది. ఇటువంటి నేపధ్యంలో ప్రభుత్వం హెలికాప్టర్ ఏర్పాటు చేయటమేంటి ? అందులో బాబ్డే ప్రయాణించటం ఏమిటంటు నిలదీశారు. ప్రశాంత్ భూషణ్ సీజే పై చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. మరి దీనిపై బాబ్డే ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది. మొన్న ఎన్వీ రమణ విషయంలో కూడా ఈయన జగన్ వైపు వకాల్తా పుచ్చుకుని మాట్లాడారు.