దసరా 2020: ఫ్యామిలీతో జెనీలియా సంబరం!

0

దసరా 2020 సెలబ్రిటీ సెలబ్రేషన్ గురించి తెలిసినదే. వరుసగా సినిమాల లుక్ లు లాంచ్ చేసి ప్రచారానికి అంకితమయ్యారు చాలా మంది స్టార్లు. ఇక ఇండ్లలో కుటుంబ సమేతంగా దసరా వేడుకను జరుపుకున్నారంటే ఆ క్రెడిట్ కరోనా మహమ్మారీకే దక్కుతుంది. ప్రతియేటా బిజీగా ఉన్నట్టు ఈ ఏడాది లేకపోవడం పండక్కి అడ్వాంటేజ్ అయ్యింది. బొమ్మరిల్లు హాసిని ఈ దసమిని ఎలా సెలబ్రేట్ చేసుకుంది? అన్నది ఆరా తీస్తే.. జెనీలియా డిసౌజా అండ్ సన్స్ రియాన్ – రాహిల్ తో కలిసి భర్త రితీష్ దేశ్ముఖ్ ఉత్సవం ఘనంగా జరుపుకుంది. అది కూడా సొంత ఇంట్లోనే.

రితీష్ దేశ్ ముఖ్ తాజా ఇన్ స్టా పోస్ట్ కన్నులపండుగను తలపించింది. దసరా సందర్భంగా రితేష్ తన కుటుంబంతో పాటు సంబరాలు జరుపుకుంటున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వీడియోలో రితీష్.. అతని భార్య జెనెలియా డిసౌజా అలాగే వారి పిల్లలు రియాన్ .. రహైల్ తో కలిసి పూజలు చేయడం చూడవచ్చు. నలుగురితో కూడిన కుటుంబం వారి పండుగ దుస్తులు ధరించారు.

పౌడర్ బ్లూ సల్వార్-కుర్తా సెట్ ధరించి జెనీలియా.. తెల్ల కుర్తా-పైజామా సెట్ లో రితేష్ దేవీ పూజా మూడ్ లో కనిపించారు. రియాన్ – రాహిల్ కూడా సాంప్రదాయ దుస్తులను ధరించారు. `హ్యాపీ దసరా` అంటూ రితీష్ వీడియోకు క్యాప్షన్ పెట్టాడు. వీటికి సెలబ్రిటీ విషెస్ రిప్లయ్ లు అందాయి.

రియాన్ – రాహిల్ తరచుగా వారి తల్లిదండ్రుల ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ లో కనిపిస్తారు. ప్రపంచ జంతు దినోత్సవం రోజున.. జెనెలియా పిల్లలతో ఒక వీడియోను పంచుకుంది. దానికి క్యాప్షన్ ని ఇచ్చింది.“మా పిల్లలు మూగ ప్రాణుల(పెట్స్ )తో కలిసి మెలిసి ఉండాలని రితీష్ నేను ఎప్పుడూ కోరుకుంటాం… ఇది ప్రకృతి జీవనం.. మనకు మాత్రమే భగవంతుడిచే ఇవ్వబడింది“ అని తెలిపారు. ఈ మహమ్మారి సమయంలో మేం పిల్లలకు దగ్గరగా ఉండటానికి ప్రయత్నించాము. వారికి కాస్త స్వేచ్ఛ ఇవ్వడానికి ఇది ఏకైక మార్గం … నేను వారిని చూశాను.. మా పెట్ డాగ్ తో ఫ్లాష్ ను జాగ్రత్తగా చెక్ చేశాను. నా వారసుడు అక్షరాలా పెట్స్ కి బెస్ట్ ఫ్రెండ్“ అంటూ ఆనందంగా నాటి సంగతిని పంచుకుంది జెనీలియా.