మొగలి రేకులు స్టార్ కు దిల్ రాజు ‘షాదీ ముబారక్’

0

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన మొగలి రేకులు సీరియల్ లో ముఖ్య పాత్రలో నటించిన ఆర్ కే నాయుడు పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించాడు. అయితే ఇప్పటి వరకు వెండి తెరపై మాత్రం ఆయనకు ఆశించిన స్థాయిలో సక్సెస్ దక్కించుకోలేక పోయాడు. ఎట్టకేలకు ఆర్ కే నాయుడుకు హీరోగా అవకాశం దక్కింది. దిల్ రాజు బ్యానర్ లో షాదీ ముబారక్ అంటూ నిన్న ఒక సినిమాను ప్రకటించారు. ఆ సినిమా ఫస్ట్ లుక్ ను నేడు విడుదల చేశారు. హీరోగా ఆర్ కే నాయుడు నటిస్తున్నట్లుగా అధికారికంగా క్లారిటీ వచ్చేసింది.

పద్మశ్రీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అంతా కొత్త వారే అయినా కూడా దిల్ రాజు బ్యానర్ లో మూవీ అవ్వడం వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి కలగడం ఖాయం. స్టార్ హీరోలతో పాటు చిన్న హీరోలతో సినిమాలను చేసేందుకు దిల్ రాజు టీం కథలు వింటున్నారు. అందులో భాగంగానే ఈ షాదీ ముబారక్ సినిమాను లో బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సూటింగ్ జరుగుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. కథల ఎంపిక విషయంలో దిల్ రాజు జడ్జిమెంట్ పై సినీ వర్గాల్లో చాలా నమ్మకం ఉంది. కనుక షాదీ ముబారక్ పై సినీ సినీ వర్గాల వారు కూడా ఆసక్తిని కనబర్చుతున్నారు.