Templates by BIGtheme NET
Home >> Cinema News >> Pathaan: బాక్సాఫీస్ వద్ద సంచలనం.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే..

Pathaan: బాక్సాఫీస్ వద్ద సంచలనం.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే..


బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan). ఆయన తాజాగా నటించిన చిత్రం ‘పఠాన్’ (Pathaan). ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 25న విడుదలైంది. బాలీవుడ్ హిస్టరీలోనే రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతుంది. ఈ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే రూ.300కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాదాపుగా రూ.313కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ఇండియాలో రూ.201కోట్లు, ఓవర్సీస్‌లో రూ.112కోట్ల వసూళ్లను సాధించిందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ స్థాయి కలెక్షన్స్‌తో అత్యధిక వేగంగా రూ.300కోట్ల క్లబ్‌లో చేరిన హిందీ సినిమాగా ‘పఠాన్’ రికార్డు సృష్టించింది. షారూఖ్ ఐదేళ్ల తర్వాత స్క్రీన్ పైకి ఎంట్రీ ఇస్తుండటంతో ‘పఠాన్’ పై విడుదలకు ముందే భారీ బజ్ ఉంది. ఆ అంచనాలను మించి ఈ చిత్రం వసూళ్లను రాబట్టింది.

‘పఠాన్’ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. దీపికా పదుకొణె (Deepika Padukone), జాన్ అబ్రహాం (John Abraham) కీలక పాత్రలు పోషించారు. స్పై థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందింది. ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌కు ప్రేక్షకులు మెస్మరైజ్ అయ్యారు. ఫలితంగా చిత్రానికి బ్రహ్మారథం పట్టారు. ‘పఠాన్’ విడుదలైన రోజు నుంచే పలు రికార్డులు సృష్టిస్తుంది. ఒపెనింగ్ డే కలెక్షన్స్‌లోను సంచలనం సృష్టించింది. హిందీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏ చిత్రం కూడా ఒక్కరోజులో రూ.65కోట్ల కలెక్షన్స్ ను సాధించలేదు. కానీ, ‘పఠాన్’ మాత్రం రెండో రోజు రూ.68కోట్ల నెట్ వసూళ్లను రాబట్టి అరుదైన ఫీట్‌ను సాధించింది.