`షకీలా`తో సౌత్ స్టార్ల రాసలీలలు తెరపై!?

0

సౌత్ ట్యాలెంట్ సిల్క్ స్మిత అలియాస్ విజయలక్ష్మి కలర్ ఫుల్ వరల్డ్ పై డర్టీ పిక్చర్ పేరుతో సినిమా తీస్తే అది బంపర్ హిట్ అయ్యింది. బయోపిక్ కేటగిరిలో సంచలన విజయం సాధించిన స్పెషల్ మూవీగా రికార్డులకెక్కింది. ఆ తర్వాత బయోపిక్ ల వెల్లువ మామూలుగా లేదు.

ప్రస్తుతం మలయాళ శృంగార తార షకీలా జీవితం ఆధారంగా ఆమె పేరుతోనే బాలీవుడ్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రిచా చద్దా ఇందులో టైటిల్ పాత్రను పోషిస్తోంది. 2020 క్రిస్మస్ కానుకగా ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది

బహుళ భాషా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇంతకుముందు రిచా చద్దా `షకీలా` లుక్ రిలీజై వైరల్ అయ్యింది. తాజాగా లాంచ్ అయిన పోస్టర్ రిచాను ఆకర్షణీయమైన అవతారంలో ఆవిష్కరించింది. చీరలో ఉన్నా చేతిలో తుపాకీతో ఆమె సౌత్ సైరన్ పాత్రకు సరైన నటి అన్న భావన కలిగించింది.

అయితే బాక్సాఫీస్ ఫలితం పోస్టర్ లుక్ తో సాధ్యం కాదు. షకీలా రేంజులో ఊంపు ఫ్యాక్టర్ ని ఎలివేట్ చేయడంలో సక్సెసైతేనే కిక్కుంటుంది. అలాగే షకీలా జీవితంలో సౌత్ స్టార్ల పాత్రలు వర్కవుటైతే ఇక్కడ బాగా డబ్బు గుంజే వీలుంటుంది.

షకీలా స్కిన్ షో.. అశ్లీల పదాలు.. మతపరమైన అనుబంధం ..తన రంగుకు సంబంధించిన ఎన్నో విషయాల్ని యథాతథంగా చూపించగలగాలి. షకీలా వైఖరిని శైలిని రిచా ప్రతిబింబిస్తుందని ఈ ఒక్క పోస్టర్ తో నిర్ణయించేయడం సరికాదు.

సూపర్ స్టార్ షకీలా జీవితంలోని ఎన్నో దిగ్భ్రాంతికరమైన నిజాలనుంచి ప్రేరణ పొందిన ఈ చిత్రం ఆమె ప్రయాణంలో అడ్డంకులు వివక్షలను తెరపై చూపించనున్నారా? అన్నది చూడాలి. సైడ్ క్యారెక్టర్లను పోషించడం నుండి బి-గ్రేడ్ చిత్రాల తారగా వెలిగిపోవడం అటుపైన శృంగార నాయికగా కీర్తి పరాకాష్టకు చేరుకోవడం ఇదంతా ఆమె లైఫ్. షకీలా ఎదుగుదల గిట్టని కొందరు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ సూపర్ స్టార్లు ఆమెను బెదిరించడం వగైరా ఎన్నో విషయాల్ని తెరపై చూపిస్తున్నారా? అన్నది చూడాలి.

సాంప్రదాయిక ముస్లిం కుటుంబంలో జన్మించిన షకీలా తన 16 వ ఏట తన నట వృత్తిని ప్రారంభించింది. సుమారు 250 చిత్రాలలో పనిచేసిన ఆమె 1990 ల చివరలో 2000 ల ప్రారంభంలో దక్షిణ చిత్ర పరిశ్రమలను పరిపాలించిన నవయవ్వన సాఫ్ట్ శృంగార తారగా ఎదిగింది.

ఈ చిత్రం గురించి దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ మాట్లాడుతూ “షకీలా అభిరుచి ఉన్న ప్రాజెక్ట్. ఆమె 2003 నుండి నటిగా తెలుసు. ఆమె రాగ్-టు-రిచెస్ కథ నా దృష్టిని ఆకర్షించింది. ఈ మూవీ కోసం తనను కొన్ని విస్తృతమైన వ్యక్తిగత ఇంటర్వ్యూలు చేసాను.యు ఆ వ్యక్తి గురించి చాలా తెలుసుకున్నాను ఆమె ఒక గొప్ప స్టార్ .. తన వెనుక చాలా సంగతి ఉంది. రిచా మాత్రమే ఈ పాత్రను చేయగలరని నమ్మాను. చిత్ర పరిశ్రమలో భాగం కావాలని కోరుకునే యువతకు మితిమీరిన గ్లిట్జ్ గ్లామర్ గురించి అర్థం చేసుకోవడానికి ఈ చిత్రం సహాయపడుతుంది. ” అని తెలిపారు.

పకీజ్ త్రిపాఠి- మలయాళ నటుడు రాజీవ్ పిళ్ళై కూడా షకీలా చిత్రంలో నటించారు. ఈ చిత్రాన్ని సామిస్ మ్యాజిక్- సినిమా మోషన్ పిక్చర్ ప్రొడక్షన్ సమర్పించి నిర్మించింది. UFO పంపిణీ చేస్తుంది. ఇది క్రిస్మస్ విడుదలకు రెడీ అవుతోంది.