Templates by BIGtheme NET
Home >> Telugu News >> బ్రహ్మపుత్రపై చైనా డ్యామ్.. అదే జరిగితే ఈశాన్య రాష్ట్రాలు ఎడారే!

బ్రహ్మపుత్రపై చైనా డ్యామ్.. అదే జరిగితే ఈశాన్య రాష్ట్రాలు ఎడారే!


భారత్ చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. లడఖ్ వద్ద చైనా కవ్వింపులకు పాల్పడటం మన సైనికులు అమరులైన విషయం తెలిసిందే. మనదేశం కూడా చైనాకు చెందిన యాప్స్ను నిషేధించింది. దీంతో ఆ దేశానికి తీరని ఆర్థికనష్టం వాటిల్లింది. అయితే చైనా మాత్రం తరచూ మనదేశాన్ని కవ్విస్తూనే ఉన్నది. నిరంతరం సరిహద్దుల్లో ఏదో ఒక వివాదాన్ని తెరమీదకు తెస్తున్నది. తాజాగా భారత్ చైనా సరిహద్దులో ఉన్న బ్రహ్మపుత్ర నదిపై భారీ ఆనకట్ట నిర్మించబోతున్నట్టు చైనా ప్రకటించింది. అయితే ఈ ఆనకట్ట కనక పూర్తైతే బంగ్లాదేశ్తోపాటు ఈశాన్య రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని.. అక్కడ కరువు కాటకాలు వచ్చే అవకాశం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చైనా 14 వ పంచవర్ష ప్రణాళికలో ఆ అంశాన్ని చేర్చారట. డ్యాం నిర్మాణాన్ని ఇప్పటికే ఓ సంస్థకు అప్పజెప్పినట్టు గ్లోబల్టైమ్స్ మీడియా సంస్థలో ఈమేరకు కథనం వచ్చింది. చైనాలో బ్రహ్మపుత్ర నదిని యార్లంగ్ జాంగ్బోగా పిలుస్తారు. చైనా పవర్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ చైర్మన్ జియాంగ్ ఈ విషయంపై మాట్లాడుతూ.. యార్లంగ్ జాంగ్బో భారీ ఆనకట్టను కట్టబోతున్నామని తేల్చి చెప్పారు. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సరిహద్దులో ఉన్న బ్రహ్మపుత్ర నదిపై చైనా భారీస్థాయిలో ఆనకట్ట నిర్మించబోతున్నదట. ప్రస్తుతం చైనాలో ఉన్న అతిపెద్ద ఆనకట్ట త్రీ జార్జ్ కు ఇప్పుడు కట్టబోయే ఆనకట్ట అందుకు మూడురెట్లు పెద్దదని చైనా ప్రకటించింది. బ్రహ్మపుత్ర నది చైనా భారత్ బంగ్లాదేశ్ మధ్య విస్తరించి ఉన్నది.

ఈ నది అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఇండియాలోకి ఎంట్రీ ఇస్తుంది. అక్కడి నుంచి ఈశాన్య రాష్ట్రాలను కలుపుతూ బంగ్లాదేశ్కు వెళ్తుంది. అయితే ప్రస్తుతం చైనా కనక భారీ ప్రాజెక్టును నిర్మిస్తే.. మన ఈశాన్య రాష్ట్రాలతోపాటు బంగ్లాదేశ్ కూడా నష్టపోతుంది. ఈశాన్యరాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ఈ నదినీళ్లతో వ్యవసాయం చేస్తున్నారు. వారికి తాగు సాగునీటికి ఈ నదే జీవనాధారం. ఆనకట్ట నిర్మిస్తామని గ్లోబల్లో కథనం వచ్చింది. అయితే ఈ విషయంపై ఇంకా భారత ప్రభుత్వం స్పందించలేదు.