మలైకా.. ఈ స్పెషల్ యోగా భంగిమ

0

50 కి చేరువవుతున్నా పర్ఫెక్ట్ ఫిజిక్ తో కాకలు పుట్టిస్తోంది అందాల సోయగం మలైకా అరోరా. 36 ఏజ్ హీరో అర్జున్ కపూర్ తో లవ్వాయణంలో ఉందంటే అంతగా నవనవల్ని మెయింటెయిన్ చేస్తూ వయసును కప్పి పుచ్చేసే ట్యాలెంట్ ఉంది కాబట్టే.

నిరంతరం యోగా జిమ్ దాంతో పాటే పర్ఫెక్ట్ ఆహార నియమాల్ని పాటిస్తూ ఈ అద్భుత రూపాన్ని సాధించుకుంది మలైకా. దేవతలకు అయితే అమృతం కావాలి కానీ మలైకా అండ్ గర్ల్స్ గ్యాంగ్ కి అలాంటివేవీ అవసరమే లేదన్న కామెంట్లు యూత్ లో వినిపిస్తుంటాయి. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ వైఫ్స్ పై ప్రత్యేక సెలబ్రిటీ షోని ప్లాన్ చేసింది నెట్ ఫ్లిక్స్. ఇందులో మలైకా లాంటి ఫేజ్ 3 భామల సొగసరి సోయగాల వెనక దాగున్న రహస్యాల్ని బయట పెట్టేయనున్నారు.

ఈ కార్తీక సోమవారం మలైకా అరోరా స్పెషల్ యోగాసనంతో ఆకట్టుకుంది. ప్రతి వారంలానే ఈసారీ ఇన్ స్టాగ్రామ్ సిరీస్ తో తిరిగి వచ్చింది. ఫిట్ నెస్ స్ఫూర్తితో కొత్త వారాన్ని ప్రారంభించడం కంటే గొప్ప ఇంకేదీ లేదు. మలైకా ప్రతి క్రొత్త పోస్ట్ మన కోసం మాత్రమే చేస్తోంది.

మలైకా అరోరా మూవ్ ఆఫ్ ది వీక్న ప్రస్తుతం గూగుల్ లో ట్రెండింగ్ గా మారుతోంది. ఈ వారం ధనురాసనా లేదా బో పోజ్ అనే యోగా భంగిమను ఎంచుకుంది మలైకా. ఇది వెనుకకు వంగే ఆసనం. పాస్టెల్ పింక్ గ్రే స్పోర్ట్స్ బ్రా టైట్స్ ధరించిన మలైకా పర్ఫెక్ట్ భంగిమతో ఫిట్ అయ్యింది. ఈ ఫోటోని ఇన్ స్టాలో పంచుకుంది. పరిపూర్ణ సోమవారం ప్రేరణ! అన్న వ్యాఖ్యతో ఆకర్షించింది.