చైనోవోడు.. చైనావాడే. ఆ విషయాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. అక్కడి శాస్త్రవేత్త ఒక అద్భుతాన్ని సృష్టించారు. ప్రపంచంలో అత్యంత వేగంగా పని చేసే సూపర్ కంప్యూర్ కంటే 100 లక్షల కోట్ల (ఈ పదాల్ని జాగ్రత్తగా చదవండి) రెట్ల వేగంతో పని చేసే క్వాంటం కంప్యూటర్ ను ఆవిష్కరించాడు. దీంతో.. అద్భుతాలెన్నో ఆవిష్కృతం కానుంది. తొలిసారి కాంతి ఆధారితంగా పని చేసే ఈ కంప్యూటర్ విశేషాల గురించి తెలుసుకుంటే నోటి వెంట మాట రాని పరిస్థితి. ఈ కంప్యూటర్ గొప్పతనాన్ని ఒక్క లైన్ లో చెప్పేయాలంటే.. ఈ పోలిక సరిగ్గా సరిపోతుంది. 60 కోట్ల ఏళ్లలో పరిష్కరించే సమస్యను కేవలం మూడంటే మూడు నిమిషాల్లోనే పరిష్కరిస్తుంది.
తాజాగా ఈ అద్భుతమైన కంప్యూటర్ గురించి చైనా శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ క్వాంటం కంప్యూటర్ కు ‘‘జిజాంగ్’’ పేరు పెట్టారు. చైనా పురాతన గణిత శాస్త్రాల నుంచి ఈ పదాన్ని తీసుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగమైన పుగాకు సూపర్ కంప్యూటర్ అరవై కోట్ల సంవత్సరాల్లో చేసే లెక్కల్ని ఇది కేవలం మూడు నిమిషాల్లో పరిష్కరించే వైనం చూస్తే.. ఇదెంత అద్భుతమో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సంప్రదాయ కంప్యూటర్లు.. 0.. 1 అంకెల ఆధారంగా పని చేస్తాయి. వీటిని బిట్లు అంటారు. అయితే.. చైనా తయారు చేసిన తాజా కంప్యూటర్ లో మాత్రం 0 1 కు బదులుగా కాంతి కణాల్ని (ఫోటాన్) ఉపయోగించారు. క్వాంటం కంప్యూటర్స్ లో వీటిని క్యూబిట్ లు అంటారు.
సాధారణ కంప్యూటర్లకు.. క్వాంటం కంప్యూటర్ కు తేడా ఏమిటంటే.. వాటికవే కమాండ్స్ ఇచ్చుకుంటూ పని చేస్తాయి. ఉదాహరణకు ఒక టీకాను డెవలప్ చేయాలంటే పలు ఔషధాల్ని పరీక్షించాలి. వాటి కాంబినేషన్ల చెక్ చేస్తుండాలి. వాటిని వాడటం వల్ల ఏం జరుగుతుందన్న విషయాన్ని తెలుసుకోవాలంటే కొన్ని రోజుల సమయం పడుతుంది. అయితే.. ఈ క్వాంటం కంప్యూటర్ మాత్రం అలాంటి దుష్ప్రభావాలను ముందే ఊహిస్తుంది. వాటి వల్ల కలిగే విపరిణామాల్ని ముందే చెప్పేస్తుంది.
సూపర్ కంప్యూటర్లకు.. క్వాంటం కంప్యూటర్లకు మధ్య తేడా ఏమిటన్నది చూస్తే.. ఒక క్యాలికులేషన్ కు ఒకే సమాధాన్ని ఇస్తాయి. అందుకు భిన్నంగా క్వాంటంలో భిన్న పరిష్కారాల్ని చూపిస్తాయి. సమాచార విశ్లేషణలో కీలకంగా వ్యవహరిస్తాయి. వీటిల్లో ఊహాజనిత సమస్యల పరిష్కారంలోనూ పాలుపంచుకుంటాయి. యూజర్ కమాండ్స్ ఆధారంగా పని చేస్తాయి.. క్వాంటం కంప్యూటర్లు తమకు తామే.. ఎలాంటి యూజర్ కమాండ్స్ అవసరం లేకుండానే వాటికవే క్యాలిక్యులేషన్స్ నిర్వహిస్తాయి. ఇదంతా చదువుతున్నప్పుడు ఏదో ఫిక్షన్ మాదిరి అనిపించట్లేదు?
భారత్ చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. లడఖ్ వద్ద చైనా కవ్వింపులకు పాల్పడటం మన సైనికులు అమరులైన విషయం తెలిసిందే. మనదేశం కూడా చైనాకు చెందిన యాప్స్ను నిషేధించింది. దీంతో ఆ దేశానికి తీరని ఆర్థికనష్టం వాటిల్లింది. అయితే చైనా మాత్రం తరచూ మనదేశాన్ని కవ్విస్తూనే ఉన్నది. నిరంతరం సరిహద్దుల్లో ఏదో ఒక వివాదాన్ని తెరమీదకు తెస్తున్నది. తాజాగా భారత్ చైనా సరిహద్దులో ఉన్న బ్రహ్మపుత్ర నదిపై భారీ ఆనకట్ట నిర్మించబోతున్నట్టు చైనా ప్రకటించింది. అయితే ఈ ఆనకట్ట కనక పూర్తైతే బంగ్లాదేశ్తోపాటు ఈశాన్య రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని.. అక్కడ కరువు కాటకాలు వచ్చే అవకాశం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చైనా 14 వ పంచవర్ష ప్రణాళికలో ఆ అంశాన్ని చేర్చారట. డ్యాం నిర్మాణాన్ని ఇప్పటికే ఓ సంస్థకు అప్పజెప్పినట్టు గ్లోబల్టైమ్స్ మీడియా సంస్థలో ఈమేరకు కథనం వచ్చింది. చైనాలో బ్రహ్మపుత్ర నదిని యార్లంగ్ జాంగ్బోగా పిలుస్తారు. చైనా పవర్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ చైర్మన్ జియాంగ్ ఈ విషయంపై మాట్లాడుతూ.. యార్లంగ్ జాంగ్బో భారీ ఆనకట్టను కట్టబోతున్నామని తేల్చి చెప్పారు. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సరిహద్దులో ఉన్న బ్రహ్మపుత్ర నదిపై చైనా భారీస్థాయిలో ఆనకట్ట నిర్మించబోతున్నదట. ప్రస్తుతం చైనాలో ఉన్న అతిపెద్ద ఆనకట్ట త్రీ జార్జ్ కు ఇప్పుడు కట్టబోయే ఆనకట్ట అందుకు మూడురెట్లు పెద్దదని చైనా ప్రకటించింది. బ్రహ్మపుత్ర నది చైనా భారత్ బంగ్లాదేశ్ మధ్య విస్తరించి ఉన్నది.
ఈ నది అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఇండియాలోకి ఎంట్రీ ఇస్తుంది. అక్కడి నుంచి ఈశాన్య రాష్ట్రాలను కలుపుతూ బంగ్లాదేశ్కు వెళ్తుంది. అయితే ప్రస్తుతం చైనా కనక భారీ ప్రాజెక్టును నిర్మిస్తే.. మన ఈశాన్య రాష్ట్రాలతోపాటు బంగ్లాదేశ్ కూడా నష్టపోతుంది. ఈశాన్యరాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ఈ నదినీళ్లతో వ్యవసాయం చేస్తున్నారు. వారికి తాగు సాగునీటికి ఈ నదే జీవనాధారం. ఆనకట్ట నిర్మిస్తామని గ్లోబల్లో కథనం వచ్చింది. అయితే ఈ విషయంపై ఇంకా భారత ప్రభుత్వం స్పందించలేదు.
కరోనా వైరస్ జోరు ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతుంది. ప్రపంచంలో ప్రతి రోజు కూడా లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. వేలల్లో మరణాలు రికార్డు అవుతున్నాయి. ఇదిలా ఉంటే .. ఈ కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది అని అడిగితే అందరూ చెప్పే ఒకే ఒక మాట చైనా. ఎందుకంటే ఈ మహమ్మారి వెలుగులోకి వచ్చింది చైనాలోనే ఆ చైనా కంట్రోల్ చేయలేకపోవడం అలాగే మహమ్మారి గురించి సరైన సమాచారాన్ని ఇతర దేశాలకి అందించలేకపోవడంతో వైరస్ వేగంగా ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందింది. అలాగే అమెరికా అధినేత ట్రంప్ అయితే కరోనా వైరస్ ను చైనా వైరస్ అని పిలిచేవారు.
అయితే చైనా మాత్రం కరోనా మహమ్మారి విషయంలో తన మీదన్న మరకను కప్పిపుచ్చుకనే ప్రయత్నాలు చేస్తోంది. ఈ మహమ్మారి వైరస్ భారత్ లేదా బంగ్లాదేశ్లో పుట్టి ఉండొచ్చని చైనా శాస్త్రవేత్తలు సంచలన ఆరోపణలు చేశారు. షాంఘై ఇన్స్టిట్యూట్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ పరిశోధకులు రాసిన ఒక ఆర్టికల్ ప్రకారం గత ఏడాది డిసెంబర్ లో వుహాన్ లో వైరస్ వ్యాప్తికి ముందే భారత ఉపఖండంలో సదరు వైరస్ ఉనికిలో ఉందని అన్నారు. దీనితో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తల బృందం మాట్లాడుతూ కరోనా వైరస్ బహుశా 2019 వేసవిలో భారతదేశంలో ఉద్భవించిందని చెప్పుకొచ్చారు. జంతువుల నుంచి కలుషితమైన నీటి ద్వారా కరోనా వైరస్ మానవులలోకి ప్రవేశించిందని చైనా బృందం తెలిపింది. కరోనా వైరస్ యొక్క మూలాన్ని గుర్తించడానికి చైనా బృందం ఫైలోజెనెటిక్ విశ్లేషణను చేస్తోంది.
విభిన్న ఉత్పరివర్తనాల ద్వారా వైరస్ యొక్క మూలాన్ని గుర్తించే ప్రయత్నంలో ఈ బృందం ఫైలోజెనెటిక్ విశ్లేషణను చేసింది. అతి తక్కువ ఉత్పరివర్తనాలతో ఉన్న జాతి అసలుదని వారు వాదించారు. దీన్ని ప్రమాణంగా చూపుతూ పరిశోధకులు మొదటి కేసులు వుహాన్ లో నమోదవ్వలేదని వాదిస్తున్నారు. అందుకు బదులుగా భారతదేశం బంగ్లాదేశ్ వైపు వేలు చూపిస్తున్నారు. ఎందుకంటే తక్కువ మ్యుటేషన్లతో వైరస్ జాతులు ఆ ప్రాంతాల్లో వ్యాప్తి చెందాయన్నది వారి వాదన. వైరస్ ఎక్కడ మొదలైందో ఆరోపించడానికి చైనా అధికారులు ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో యుఎస్ ఇటలీలను మొదటి కరోనా కేసులు నమోదైనట్లు వ్యాఖ్యలు చేశారు.
కరోనా వైరస్ కల్లోలం కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి దెబ్బకి మొత్తం ప్రపంచమే వణికిపోయింది. ఈ వైరస్ వెలుగులోకి వచ్చి నెలలు గడుసున్నా కూడా ఇప్పటికి ఎంత మాత్రం తగ్గలేదు. ఇక తాజాగా కరోనా పుట్టినిల్లు అయిన చైనాలో మరోసారి ఈ వైరస్ విజృంభిస్తోంది. ఈ కారణంగా చైనాలోని అత్యంత రద్దీ అయిన ఎయిర్ పోర్టుల్లో ఒకటైన పుడాంగ్ లో విమాన సర్వీసులను రద్దు చేశారు. రెండో విడత కరోనా వ్యాప్తిలో భాగంగా షాంఘై ప్రాంతంలో ఇటీవల ఏడుగురికి కరోనా పాజిటివ్ గా తేలింది. వీరంతా కూడా ఎయిర్ పోర్టు సిబ్బంది కాంటాక్ట్ కారణంగా కరోనా సోకినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమయంలో విమానాశ్రయంలో వైమానిక సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆ దేశ విమానయాన శాఖ ఓ ప్రకటన జారీచేసింది. అలాగే విమానశ్రయంలో పనిచేస్తున్న వేలాదిమంది సిబ్బందికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఇప్పటివరకు 17700మందికి కరోనా స్వాబ్ టెస్టులు చేసినట్లు అధికారులు తెలిపారు. మొదటగా గత ఏడాది చివర్లో వుహాన్ నగరంలో మొదలైన కరోనా వైరస్ ఆ తర్వాత కొంచెం కొంచెం గా ప్రపంచం మొత్తం విస్తరించింది. దీనితో చైనాతో సహా అన్ని ప్రాంతాల్లోనూ లాక్ డౌన్ లు ప్రయాణాలపై ఆంక్షలు విధించడం జరిగింది. కట్టుదిట్టమైన నియంత్రణ చర్యల కారణంగా కరోనా వైరస్ ను చైనా చాలా వరకు నియంత్రించింది. రెండో విడతలో మళ్లీ వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో ఇక్కడ కరోనా క్లస్టర్ కనిపించింది.
కొద్ది నెలలుగా భారత్ చైనాల మధ్య సరిహద్దు వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నిస్తోన్న చైనా బలగాలకు భారత సైన్యం దీటుగా జవాబిస్తోంది. ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా తీరు మారని చైనా సైన్యం….ఏకంగా అరుణాచల్ ప్రదేశ్ సమీపంలోని సరిహద్దులో ఓ గ్రామాన్ని ఆక్రమించుకొని పాగా వేసిందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా సమాచార గోప్యత దృష్ట్యా మరో 43 చైనా యాప్ లపై మోడీ సర్కార్ నిషేధం విధించింది. చైనా నుంచి నడుస్తోన్న ఈ 43 యాప్ లపై ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ నిషేధం విధించిందని కేంద్రం ప్రకటించింది. కేంద్ర హోం శాఖతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దేశ సార్వభౌమత్వం సమగ్రత భద్రత సమాచార గోప్యతకు భంగం కలిగిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే 267 చైనా యాప్ లై భారత్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
గతంలో టిక్ టాక్ పబ్ జీ వంటి ప్రముఖ యాప్ లతో పాటు తాజాగా నిషేధించిన కేంద్రం తాజాగా అలీ ఎక్స్ప్రెస్ స్నాక్ వీడియో మ్యాంగో టీవీ వంటి పలు యాప్ లపై ఉక్కుపాదం మోపింది. సమాచార గోప్యత పాటించడం లేదన్నకారణంతో వీటిపై కేంద్రం ఐటీ చట్టం 69 ఏ సెక్షన్ ప్రకారం నిషేధం విధించింది. చైనా రిటైల్ దిగ్గజం అలీ బాబా గ్రూప్నకు చెందిన 4 యాప్లతో పాటు మరికొన్ని ప్రముఖ చైనా యాప్ లు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ 43 యాప్ లపై భారతీయ యూజర్ల నుంచి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు వేల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయని అందుకే నిషేధం విధించామని కేంద్ర ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ తెలిపింది. గాల్వన్ లోయలో ఘర్షణల అనంతరం పాక్ పై సర్జికల్ దాడుల తరహాలో చైనాపై ‘డిజిటల్ స్ట్రయిక్స్’ పేరిట యాప్ లపై నిషేధం విధిస్తూ చైనాకు బుద్ధి చెబుతోందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
కరోనా వ్యాధితో ప్రపంచం మొత్తం తలకిందులైంది. ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు అన్ని దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కొన్నిదేశాల్లో తగ్గుముఖం పట్టినప్పటికీ.. మరికొన్ని దేశాల్లో సెకండ్వేవ్ ముంచుకొస్తున్నది. వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చాలా దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇదిలో ఉంటే కరోనా పోకేముందే మరో మహమ్మారి సిద్ధంగా ఉన్నదని డబ్ల్యూహెచ్వో హెచ్చరికలు జారిచేసింది. అది కూడా కరోనా లాగే చైనా లోని ఓ ల్యాబ్లో పుట్టిందని సమాచారం. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) 73వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ వర్చువల్ సెషన్లో భాగంగా ప్రతినిధులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ప్రపంచం మరో మహమ్మారిని ఎదుర్కొవడానికి సిద్దంగా ఉండాలని డబ్ల్యూహెచ్ వో పిలుపునిచ్చింది.
ఈ విషయంలో వరల్డ్ హెల్త్ అసెంబ్లీ కోవిడ్-19 వంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల (2005)కు అనుకూలంగా ఓ బలమైన ముసాయిదా తీర్మానాన్ని పరిశీలిస్తుంది అని తెలిపింది. వుహాన్ ల్యాబ్ నుంచి కరోనా బయటపడిందని పలువురు భావిస్తున్నారు. ఇప్పటికీ ఈ మహమ్మారి అదుపులోకి రాలేదు. ఇంతలోనే చైనాలోని గన్సు ప్రావిన్స్ రాజధాని లాన్జౌలో 6000 మందికి పైగా బ్రూసెల్లోసిస్ అనే బ్యాక్టీరియా వ్యాధి పాజిటివ్ వచ్చినట్లు స్థానిక ప్రభుత్వం తెలిపింది. ఇది కూడా స్థానికంగా ఉన్న ఓ వ్యాక్సిన్ ప్లాంట్ నుంచే ఏడాది క్రితం లీకైనట్లు సమాచారం. ఈ క్రమంలో లాన్జౌ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ‘పట్టణంలోని 55725కి పరీక్షలు చేశాం. వీరిలో 6620 మందికి పాజిటివ్గా తేలింది’ అని తెలిపారు. పశువుల మీద ఉండే బ్రూసెల్లా అనే బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందని తెలిపారు.
బ్రూసెల్లోసిస్ లక్షణాలివే..
ఈ వ్యాధి సోకిన వారిలో కూడా ఫ్లూలో కనిపించే లక్షణాలే ( దగ్గు జలుబు జ్వరం వొల్లునొప్పులు) కనిపిస్తాయి. కలుషితమైన ఆహారపదార్థాలు నీళ్లు తాగడం వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నదని వైద్యులు చెబుతున్నారు.
లాక్డౌన్ పేరుతో చైనా డ్రామాలు ఆడిందా! ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించి తాను మాత్రం సేఫ్ అయ్యిందా! ప్రపంచంపై ఆధిపత్యం కోసమే ఇలాంటి కుయుక్తులు పన్నిందా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. కరోనాను కట్టడి చేయాలంటే లాక్డౌన్ ఒక్కటే శరణ్యమని.. తాము కూడా కఠినంగా లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నామంటూ ప్రపంచాన్ని చైనా తప్పుదోవ పట్టించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరోనా వైరస్ మొదట చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన విషయం తెలిసిందే. అక్కడ కరోనా కట్టడికి చైనా.. వుహాన్ను షట్డౌన్ చేసింది. అందరినీ ఇళ్లకే పరిమితం చేసింది. ఈ విషయంలో చైనా వైఖరిని అమెరికాకు చెందిన ప్రముఖ లాయర్ మైఖెల్ సెంగర్ తప్పు పట్టారు. ప్రపంచదేశాలను ఆర్థికంగా బలహీనపరిచేందుకు చైనా లాక్డౌన్ అస్త్రాన్ని ప్రయోగించిందని.. ప్రపంచదేశాలన్నీ చైనా ట్రాప్లో పడిపోయాయని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. కరోనా వైరస్ అంటేనే భయం కలిగించేలా చైనా సోషల్మీడియాలో దుష్ప్రచారం మొదలుపెట్టిందని చెప్పారు.
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా కట్టడిలో హార్డ్ ఇమ్యూనిటీకే ప్రాధాన్యమిచ్చారు. కానీ ఆ తర్వాత డ్రాగన్ ఇచ్చిన తప్పుడు సమాచారంతో బ్రిటన్ను లాక్డౌన్ చేశాడు. ఇదంతా చైనా కుట్రే అని సెంగర్ ఆరోపించారు. ఇటీవల టాబ్లెట్ అనే మ్యాగజైన్లో ‘చైనా గ్లోబల్ లాక్డౌన్ ప్రాపగండా క్యాంపైన్’ అనే పేరుతో ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంలో మైఖేల్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. చైనా కరోనాపై తప్పడు ప్రచారం చేసేందుకు ట్విట్టర్ను వేదికగా చేసుకున్నదని.. గత జూన్లో ట్విట్టర్ దాదాపు 23750 ట్విట్టర్ అకౌంట్లలో కరోనాపై తప్పుడు సమాచారాన్ని గుర్తించినట్టు ట్విట్టర్ ధ్రువీకరించింది. ఆయా ఫేక్ అకౌంట్లను ట్విట్టర్ తొలగించింది. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టరే అంగీకరించింది. దీని ఆధారంగా చైనా వాళ్లు కావాలనే కరోనాను ఓ భూతంలా చూపారని ఆరోపణలు చేస్తున్నారు.
భారత్ – చైనాల మధ్య 1962లో జరిగిన యుద్దంలో చైనానే విజయం సాధించింది. సాధారణంగా యుద్ధం గెలిచిన దేశం గానీ రాజ్యం గానీ… ఏం చేస్తాయి? శత్రు దేశంలో వీలయినంత మేర ప్రాంతాన్ని ఆక్రమించేస్తాయి. అయితే అందుకు విరుద్ధంగా అరుణాచల్ ప్రదేశ్ ను తమలో కలుపుకునే విషయంలో మాత్రం చైనా వెనుకంజ వేసింది. నిజమా? అంటే… ఓ వైపు చరిత్ర ఇదే విషయాన్ని చెబుతుండగా మరోవైపు ఏళ్ల తరబడి అరుణాచల్ ప్రదేశ్ లోని చాలా భాగం తమదేనని ఇప్పటికీ చైనా వాదిస్తుండటంతో ఈ వాదన నిజమేనని చెప్పక తప్పదు. మరి అరుణాచల్ ప్రదేశ్ లోని సగానికి పైగా భూభాగం తమదేనని బీరాలు పలుకుతున్న చైనా… 1962నాటి యుద్ధంలో గెలిచినా కూడా ఎందుకు అరుణాచల్ ప్రదేశ్ స్వాధీనానికి ఎందుకు సిద్ధపడలేదు? దీని వెనుక చాలా వ్యూహాత్మక అంశాలున్నట్లుగా తాజాగా వెలుగులోకి వచ్చింది.
ప్రస్తుతం ఈశాన్య భారత్ లోకి చైనా బలగాలు క్రమంగా చొచ్చుకువస్తున్న నేపథ్యంలో మరోమారు ఇరు దేశాల మధ్య ఎప్పటికప్పుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. రెండు దేశాల మధ్య యుద్ధం తప్పదేమోనన్న భయాందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో 1962 యుద్ధం – ఆ యుద్ధం తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ను చైనా వదిలేయడం తదితర అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి. నాటి నుంచి నేటి దాకా అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రజలు ఏనాడూ చైనాకు అనుకూలంగా వ్యవహరించడం లేదు. ఇలాంటి పరిస్థితిలో అరుణాచల్ ప్రదేశ్ ను స్వాధీనం చేసుకున్నా.. అక్కడి ప్రజల వ్యతిరేకత నేపథ్యంలో ఆ ప్రాంతంపై పూర్తి స్థాయిలో ఆధిపత్యం సాధించలేమన్నది చైనా భావన. ఈ కారణంగానే నాడు అరుణాచల్ ప్రదేశ్ ను స్వాధీనం చేసుకునే అవకాశం చిక్కినా చైనా ఆ దిశగా అడుగులు వేయలేదు.
చైనా వెనుకంజకు మరో రెండు కారణాలు కూడా లేకపోలేదు. 1962లో తన చేతిలో భారత్ ఓడిపోయినా.. భారత సైన్యం ప్రతిభాపాటవాలు శక్తిసామర్థ్యాలను చైనా తక్కువగా అంచనా వేయలేదు. నాడు గానీ నేడు గానీ భారత సైన్యం అంటే చైనాకు భయమే. భారత్ కంటే కూడా సైనిక పరంగా బలంగా ఉన్నప్పటికీ… భారత్ సైన్యాన్ని చూస్తే చైనాకు వణుకుపుడుతోంది. ఈ కారణంగానూ అరుణాచల్ ను చైనా తనకు తానుగా వదిలేసిందన్నది నిపుణుల అభిప్రాయం. ఇక అరుణాచల్ ప్రదేశ్ తో చైనాకు ఉన్న సరిహద్దును మెక్ మోహన్ రేఖగా పిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ రేఖపై ఇప్పటిదాకా పెద్దగా స్పష్టతే లేదు. అంటే… చైనా అరుణాచల్ ప్రదేశ్ లోకి చొచ్చుకువచ్చినా.. మెక్ మోహన్ రేఖను ప్రస్తావిస్తూ భారత్ అంతర్జాతీయంగా పోరాటం మొదలెడితే ఇబ్బందేనన్నది చైనా భయం. ఈ అంశం కూడా అరుణాచల్ ను చైనా వదిలేయడానికి మరో కారణమని నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి వైరస్ మనుగడపై ఇప్పటికీ ఓ సరైన అభిప్రాయానికి రావడంలేదు. అయితే ఇప్పటివరకు ఆహార పదార్థాలపై కరోనా వైరస్ ఉనికిపై ఆందోళనకరమైన సిద్ధాంతాలేవీ లేవు. కానీ తాజాగా చైనా పరిశోధకుల అధ్యయనంలో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. చైనా నుంచి ప్రపంచానికి స్ప్రెడ్ ఆయిన సంగతి తెలిసిందే. చైనాలో ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. ఆహార పదార్ధాలపై కరోనా ఉంటుందనే విషయం తెలిసిందే. అయితే చేపల్లో కరోనా వైరస్ ఎన్ని రోజులు ఉంటుంది అనే దానిపై చైనా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు.
ప్రపంచంలో అత్యధికులు ఎంతో ఇష్టపడి తినే చేపలు సాల్మన్ చేపలు. ఇవి ఎంతో ఖరీదైనవి కూడా. అయితే సాల్మన్ చేపల్లో కరోనా వైరస్ క్రిములు వారం రోజుల వరకు ఉంటాయని చైనా పరిశోధకుల అధ్యయనంలో గుర్తించారు. నాలుగు డిగ్రీల సెంటిగ్రేట్ వద్ద నిలువ ఉంచిన సాల్మన్ చేపల్లో 9 రోజులపాటు కరోనా వైరస్ జీవించి ఉంటుందని తేలింది. అలానే గది ఉష్ణోగ్రత వద్ద అంటే 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద సాల్మన్ చేపల్లో రెండు రోజులపాటు కరోనా వైరస్ జీవించి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. సాల్మన్ చేపలను ఎగుమతి చేసే సమయంలో వాటిని ఉంచే బాక్సుల్లో 4 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా చూస్తారు. ఈ విధంగా అయితే వైరస్ 6 రోజులు మనుగడ సాగిస్తుందని చైనా పరిశోధకులు చెబుతున్నారు. చైనా సీపుడ్ మార్కెట్ల ద్వారా ఈ వైరస్ రక్కసి వ్యాపించి ఉంటుందన్న వాదనలకు తాజా అధ్యయనం బలం చేకూర్చుతోంది. తడిగా ఉండే ఫిష్ మార్కెట్ నుంచి కరోనా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
అగ్గిపుల్ల సబ్బు బిళ్ల కుక్క పిల్ల….కాదేది కవితకనర్హం అన్నారు మహాకవి శ్రీ శ్రీ….ఈ మాటలను వంటబట్టించుకున్న పలు దేశాలు పావురాలు కాకులు గద్దలు వేల్స్ డాల్ఫిన్లుషార్క్ లు పిల్లులు ఉడతలు సీ లయన్స్…ఇలా గూఢచర్యానికి కావేవీ అనర్హం అని అంటున్నాయి. శత్రు దేశాల సమాచారం రాబట్టేందుకు పలు దేశాలు జంతువులతో గూఢచర్యం చేయించిన ఘటనలు కోకొల్లలు. శత్రుదేశాల సైనిక స్థావరాల్లో కీలక ప్రదేశాల్లో ఆయా జంతువులను వేగులుగా ఉపయోగించి పలు దేశాలు సమాచారాన్ని సేకరించిన వైనం తెలిసిందే. ఇదే తరహాలో తాజాగా భారత్ పై చైనా జడల బర్రెలను గూఢచర్యానికి ఉపయోగించిందా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. కొద్ది రోజుల క్రితం భారత భూభాగంలోకి వచ్చిన 13 జడల బర్రెలు 4 దూడలను చైనా గూఢచర్యానికే పంపిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే వాటిని చైనాకు భారత సైన్యం అప్పగించి ఉంటుందన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.
మామూలుగా అయితే జంతువులు పొరపాటున సరిహద్దులు దాటడం కామన్. అయితే కొంతకాలం భారత్ చైనాల మధ్య ఉద్రిక్తతలు తాజాగా లడఖ్లో ఇరు దేశాల సైనికుల మధ్య కాల్పులు జరిగాయన్న అనధికార వార్తల మధ్య ఈ జంతువుల గూఢచర్యం వ్యవహారం హాట్ టాపిక్ అయింది. ఆగస్టు 31న జడల గేదెల మంద చైనా భూభాగాన్ని దాటుకొని అరుణాచల్ ప్రదేశ్ లోకి వచ్చింది. వారం రోజుల తర్వాత మన సైన్యం వాటిని తిరిగి చైనా యజమానులకు అప్పగించింది. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో గూఢచర్యం కోణంలో ప్రచారం జరుగుతోంది. వాటిలో నిఘా పరికరాలను ఉంచారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే జంతువులతో గూఢచర్యం కొత్త కాదు. మన దేశంలో పావురాలు గద్దలను సమాచారాన్ని చేరవేయడానికి గూఢచర్యం చేయడానికి ఉపయోగించేవారు. గత ఏడాది ఏప్రిల్లో నార్వే తీరంలో ఓ బెలుగా వేల్ మెడ చుట్టూ పట్టీ ఉండడంతో రష్యా గూఢచర్యం చేసిందేమో అని అనుమానాలు వచ్చాయి. రష్యాతో ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో డాల్ఫిన్లతో రష్యా సబ్మెరైన్లపై మరో సందర్భంలో సీ లయన్స్ తో అమెరికా నిఘా పెట్టింది. ఇజ్రాయెల్ డాల్ఫిన్లను ఉపయోగించి గూఢచర్యానికి పాల్పడుతోందని హమాస్ ఆరోపించింది.మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో పావురాలు సైనికుల మధ్య సందేశాలు అందించాయి. పాక్ సరిహద్దుల్లో గూఢచర్యం చేస్తున్న పావురాలను పట్టుకున్న ఘటనలు ఉన్నాయి.
అమెరికా సైన్యం పావురాల తరహాలోనే కాకులను షార్కులను కూడా గూఢచర్యానికి ఉపయోగించుకుంది. సోవియట్ ఎంబసీల్లో సీఐఏ పిల్లులతో ఆడియో రికార్డింగ్ చేయించాలని విఫలమైంది.తమ అణు శుద్ధి ప్లాంట్పై నిఘా కోసం ఇజ్రాయెల్ 14 ఉడుతలను గూఢచర్యం చేసేందుకు పంపిందని ఇరాన్ ఆరోపించింది. పశ్చిమ దేశాలు ఊసరవెల్లులనూ తమ దేశంలోకి పంపుతున్నాయని ఇరాన్ ఆరోపించింది.పెలికాన్ కొంగలతోనూ ఇజ్రాయెల్ గూఢచర్యానికి పాల్పడుతోందని సూడాన్ ఆరోపించింది. అరుదైన బొనేలీ గద్దను గూఢచర్యం అనుమానాలతో లెబనాన్ దళాలు చంపేశాయి. మరి తాజాగా ఈ జడల బర్రెల వెనుక మర్మం ఏమిటన్నది తేలాల్సి ఉంది.
భారత్ చైనా సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న ఈ సమయంలో కూడా భారత్ మానవత్వాన్ని చాటి మేము రక్తపాతాన్ని కోరుకోవడం లేదు అని పరోక్షంగా సంకేతాలు పంపింది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ చైనా సరిహద్దుల్లో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి సంచరిస్తున్న 13 జడల బర్రెలు 4 దూడలపై మానవత్వం చూపుతూ వాటిని చైనా సైన్యానికి మన దేశ సైనికులు అప్పగించారు. ఈ విషయాన్ని ఈస్ట్రన్ కమాండ్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. చైనా అధికారులు వీటి స్వీకరించి కృతజ్ఞతలు తెలిపారని ట్వీట్ లో వెల్లడించింది.
ఆగస్టు 31న ఈస్ట్ కమేంగ్ ప్రాంతంలో ఇవి తిరుగుతూ కనబడ్డాయి. వీటిపై మానవత్వం చూపిస్తూ ఈ నెల 7వ తేదీన చైనా అధికారులకు అప్పగించాం అని తెలిపింది. ఈ చర్యలు ఇరు దేశాల మధ్య ఉద్రికత్తలు తగ్గించడానికి ఉపయోగపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. చైనా ఓ వైపు ద్వైపాక్షిక చర్చలు జరుపుతూనే మరోవైపు కవ్వింపు చర్యలకు దిగుతోందని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎమ్ నారావణే మాట్లాడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాంగ్యాంగ్ సరస్సు వద్ద ఉన్న కీలక ప్రాంతాలపై పట్టు కోసం ఇరు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. గల్వాన్ లోయలో ఇరు దేశాల మధ్య కాల్పులు కూడా జరిగాయి. పరిస్థితిని పునరుద్దరించడానికి ఇరుదేశాల నేతలు అనేక సార్లు చర్యలు జరుపుతున్నప్పటికీ పరిష్కారం మాత్రం దొరకడంలేదు. ఫింగర్ గల్వాన్ వ్యాలీ హాట్ స్ప్రింగ్స్ కొంగ్రుంగ్ నాలా తదితర ప్రాంతాల వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. భారత్ చైనాతో స్నేహపూర్వకంగా కొనసాగే కొద్దీ ..చైనా కవ్వింపు చర్యలకి దిగుతూనేఉంది.
భారత్కు సరిహద్దు దేశాల నుంచి సమస్యలు తప్పడం లేదు. లడఖ్ సరిహద్దులో చైనా మరోసారి ఘర్షణ వాతావరణాన్ని సృష్టించింది. ఆ దేశ సైనికులు వాస్తవాధీన రేఖను దాటి భారత్ భూభాగంలోకి వచ్చేందుకు మళ్లీ ప్రయత్నించారు. అయితే చైనా సైనికుల కదలికలపై ముందు నుంచి నిఘా ఉంచిన భారత్ ఆర్మీ ధీటుగా బదులిచ్చింది. దీంతో మరోసారి రెచ్చగొట్టేందుకు ప్రయత్నించిన చైనా సైనికుల ప్రయత్నాలు సాగలేదు.
లడఖ్ సరిహద్దులోని పాంగోంగ్ త్సో సరస్సు వద్ద జరిగిన ఘటన గురించి రక్షణ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 29 రాత్రి నుంచి 30వ తేదీ ఉదయం వరకు ఆకస్మిక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సుమారు 200 మంది చైనా సైనికులు ఒక వాహనంలో ఈ నెల 29 రాత్రి 11 గంటలకు లడఖ్ సరిహద్దులోని భారత్ సైనిక పోస్టు వద్దకు వచ్చారు. దీని గురించి ముందుగానే సమాచారం అందుకున్న భారత ఆర్మీ దీటుగా ఎదుర్కొనేందుకు సన్నాహాలు చేసింది. దీంతో భారత్ సైనిక పోస్టు వద్దకు చేరిన చైనా సైనికులు భారత బలగాలను చూసి కంగుతిన్నారు. అనంతరం కొంతసేపు భారత్ సైనికులతో తోపులాటకు పాల్పడ్డారు.
మరోవైపు చైనా సైనికులు ముందుకు రాకుండా భారత జవాన్లు నిలబడి వారిని అడ్డుకున్నారు. ఇరువురు సైనికులు కొన్ని గంటల పాటు అక్కడే అలాగే ఉన్నారు. భారత్ సైనికులు కూడా భారీగానే ఉండటంతో చైనా సైనికులు వెనక్కి తగ్గారు. తమ వాహనంలో తిరిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా ఈ తోపులాటలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఆర్మీ వర్గాలు తెలిపాయి.
జూన్ 15న లడఖ్లోని గల్వాన్ లోయ వద్ద చైనాతో జరిగిన ఘర్షణలో తెలంగాణకు చెందిన కర్నల్ సంతోష్ బాబుతో సహా 20 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. దీంతో నాటి నుంచి సరిహద్దులో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. అయితే సరిహద్దులో సైనిక బలగాలను తగ్గించుకునే అంశంపై ఇరు దేశాల మధ్య ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరుగుతున్నాయి. అయినప్పటికీ చైనా తన బుద్ధి మార్చుకోవడం లేదు. తాజాగా భారత్ భూటాన్ చైనా సరిహద్దుల్లో హెలిపోర్ట్ను పీఎల్ఏ దళాలు నిర్మిస్తున్నాయి. సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైళ్ల కేంద్రాలను చైనా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. ఉపగ్రహ చిత్రాల ద్వారా చైనా ఆర్మీ చేస్తున్న కుట్రలు బయటపడుతున్నాయి. తాజాగా ఇంటెలిజెన్స్ సంస్థ డెట్రెస్ఫా తన ట్విట్టర్లో చైనా సైనిక దళాలు నిర్మిస్తున్న కట్టడాల చిత్రాలను పోస్టు చేసింది.
డోక్లామ్తో పాటు సిక్కిం సెక్టార్ల సమీపంలో ఆ హెలిప్యాడ్ నిర్మాణం జరుగుతోంది. నాకు లా డాక్లా పాస్కు 100 కిలోమీటర్ల దూరంలో ఆ హెలిపోర్ట్ ఉంది. అన్ని తరహాల వాతావరణాన్ని తట్టుకునే విధంగా నిర్మాణం సాగుతున్నది. తమ నిఘా వ్యవస్థను చైనా పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది. అనుమానిత హెలిపోర్ట్లో మిస్సైల్ సదుపాయాలను రేడార్ వార్నింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలాఉండగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం తూర్పు లదాక్లో ప్రస్తుత పరిస్థితిపై వరుసగా కీలక భేటీలు జరిపినట్లు సమాచారం. కేంద్ర హోం రక్షణ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు తూర్పు లదాక్ తోపాటు తాజాగా ఉద్రిక్తతలు చోటుచేసుకున్న చుశూల్ సెక్టార్లపై ప్రధానికి వివరించినట్లు తెలుస్తోంది.
భారత సరిహద్దుల్లోకి చొచ్చుకొచ్చిన డ్రాగన్ దేశ సైనికులకు మన సైనికులు ధీటుగా బదులివ్వటం.. ఈ ఉదంతంలో భారత్ కు చెందిన పలువురు సైనికులు వీర మరణం పొందటం తెలిసిందే. ఎలాంటి ఆయుధాలు లేని భారత సైనికుల మీద ఇనుప కమ్మీలున్న ఆయుధాలతో చైనా సైనికులు దాడికి పాల్పడటం తెలిసిందే. ఈ ఉదంతంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కల్నల్ తో పాటు పలువురు సైనికులు వీర మరణం పొందారు. తమపై దాడికి తెగబడిన డ్రాగన్ దేశ సైనికులకు బుద్ధి చెప్పటమే కాదు.. ఆ దేశానికి చెందిన సైనికులు ఎక్కువగానే మరణించారు.
దీనికి సంబంధించిన సమాచారాన్ని బయటకు పొక్కకుండా చైనా జాగ్రత్తలు తీసుకుంది. ఇప్పటివరకు ఈ ఉదంతంలో ఎంతమంది సైనికులు మరణించారన్న విషయాన్ని బయటపెట్టింది లేదు. ఇదిలా ఉండగా.. మరణించిన చైనా సైనికుడికి చెందిన సమాధి ఒకటి తాజాగా వెలుగు చూసింది. చైనాలోని సోషల్ మీడియాలో వచ్చిన ఈ సమాధి తాజాగా వైరల్ గా మారింది.
చైనాకు చెందిన చెన్ షియాంగ్రాంగ్ అనే పందొమ్మిదేళ్ల జవాను ఒకరు భారత సరిహద్దులో వీర మరణం పొందినట్లుగా ఆ సమాధి మీద మాండరిన్ భాషలో రాసి ఉన్నట్లు గుర్తించారు. భారత సైనికులతో జరిగిన దాడిలో మరణించిన సైనికులకు సంబంధించిన తొలి సాక్ష్యంగా దీన్ని చెప్పాలి. ప్రస్తుతం చైనా సోషల్ నెట్ వర్క్ అయిన వెయ్ బోలో ఈ సైనికుడి సమాధి ఫోటో వైరల్ గా మారింది.
దక్షిణ షిన్ జియాంగ్ సైనిక ప్రాంతంలో ఆగస్టు ఐదున ఈ సమాధి శిలను ఏర్పాటు చేసినట్లుగా సదరు ఫోటో చెబుతోంది. ‘‘పుజియాన్ లోని పింగ్నాన్ కు చెందిన 69316 యూనిట్ సైనికుడు చెన్ షియాంగ్రాంగ్ సమాధి ఇది. 2020 జూన్ లో భారత సరిహద్దు బలగాలతో జరిగిన ఘర్షణల్లో ప్రాణ త్యాగం చేశాడు. కేంద్ర సైనిక కమిషన్ ఆయన్ను మరణానంతరం స్మరించుకుంటుంది’’ అంటూ పేర్కొన్నారు. అయితే.. ఇది నిజమైన సమాధి కాదని.. ఫేక్ అన్న ప్రచారం సాగుతోంది. అయితే.. దీనిపై చైనా అధికారులు ఎవరూ ఇప్పటివరకూ స్పందించలేదు. తాజా పోస్టు.. చైనా దేశ సర్కారును ఇరుకున పెడుతుందన్న మాట వినిపిస్తోంది.