బేబీ బంప్ ను కూడా కమర్షియల్ కోసం వాడుకోవాలా?

0

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ మరోసారి తల్లి కాబోతున్న విషయం తెల్సిందే. సైఫ్ అలీ ఖాన్.. కరీనా కపుల్స్ ఇప్పటికే తైమూర్ అనే కొడుకును కలిగి ఉన్నాడు. తైమూర్ గురించి రెగ్యులర్ గా సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది.

ప్రస్తుతం ఈమె మరో సారి గర్బవతి అయినట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. కాని డెలవరీకి చాలా సమయం ఉండి ఉంటుందని అంతా భావించారు. కాని తాజాగా కరీనా కపూర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె మరికొన్ని రోజుల్లోనే సైఫ్ ను రెండవ సారి తండ్రిని చేయబోతున్నట్లుగా క్లారిటీ వచ్చేసింది.

కరీనా కపూర్ బేబీ బంప్ తో తన సోదరి కరిష్మా కపూర్ తో కలిసి ఒక కమర్షియల్ యాడ్ లో నటించింది. ఈ సమయంలో కూడా డబ్బు సంపాదన కోసం ఏంటీ ఈ పని అంటూ కొందరు నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. బేబీ బంప్ తో మోడల్స్ షూట్ చేయడానికే ఇబ్బంది పడుతూ ఉంటారు. కాని కరీనా కపూర్ మాత్రం తన రియల్ బేబీ బంప్ తో షూటింగ్ చేసేందుకు ఏమాత్రం మొహమాటం లేకుండా షూట్ లో పాల్గొంటుంది.

బేబీ బంప్ తో షూటింగ్ లో పాల్గొంటున్న కరీనా కపూర్ పై చాలా మంది విమర్శలు చేస్తుంటే మరికొందరు మాత్రం ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆమె వృత్తిని గర్బవతిగా ఉన్నప్పుడు చేయకూడదు అంటే ఎలా అంటూ ఆమె అభిమానులు కొందరు ప్రశ్నిస్తున్నారు. త్వరలో కరీనా కపూర్ బేబీ బంప్ తో ఉన్న కమర్షియల్ యాడ్ ప్రసారం అవ్వబోతుంది.