ఎఫైర్ కహానీలు పట్టించుకోని `సాహో` శ్రద్ధ ఇలా ఎంజాయ్!

0

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ సాహో చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైంది. అంతకుమించి ఈ భామ వరుస ఎఫైర్ కహానీలతో అభిమానులకు టచ్ లో ఉంటుంది. ఇప్పటికే అరడజను హీరోల పేర్లు శ్రద్ధా ఖాతాలో వినిపించాయి.

వీళ్లలో ఫర్హాన్ అక్తర్ – వరుణ్ ధావన్- ఆదిత్య రాయ్ కపూర్.. పేర్లు ప్రముఖంగా పాపులరయ్యాయి. ఎబిసిడి 2 చిత్రీకరణ సమయంలో వరుణ్ ధావన్ తో ఎఫైర్ పెట్టుకుందన్న ప్రచారం వేడెక్కించింది. అలాగే ఆషిఖి 2 సమయంలోనే ఆదిత్యరాయ్ కపూర్ తో లవ్ లో పడిందని ప్రచారమైంది. కానీ శ్రద్ధా – ఆదిత్య ఒక సంబంధంలో ఉన్నట్లు ఒప్పుకోలేదు.

దర్శకనటుడు.. నిర్మాత ఫర్హాన్ తో శ్రద్ధా లివిన్ రిలేషన్ షిప్ గురించి చాలాకాలం పాటు ఆసక్తికర చర్చ సాగింది. ఇటీవల స్నేహితుడు రోహన్ శ్రేష్టతో లింకప్ వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ ఏది నిజం.. ఏది అబద్ధం అన్నది మాత్రం అర్థం కాని పరిస్థితి. మరోవైపు సోషల్ మీడియాలో ఎంతో జోరుమీదుండే శ్రద్ధా నిరంతరం తన ఆస్వాధనలకు సంబంధించిన ఫోటోల్ని వీడియోల్ని షేర్ చేస్తోందిలా. బులుగు జిలుగు సముద్రం చెంత శ్రద్ధా సమ్మోహనానికి గురి చేస్తున్న ఈ వీడియో అభిమానుల్లో వైరల్ గా మారింది. శ్రద్ధా ధరించిన ఆ ఫ్లోరిష్ డిజైనర్ పరికిణీ వండర్ ఫుల్ అంటూ అభిమానులు వ్యాఖ్యల్ని జోడిస్తున్నారు. భాఘి 3 తర్వాత శ్రద్ధా పలు చిత్రాలకు సంతకాలు చేసింది. ప్రస్తుతం షూటింగులు జరుగుతున్నాయి. వాటి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.