మెగా హీరోలు అందరు అయ్యారు.. ఇప్పుడు వరుణ్

0

మెగా ఫ్యామిలీ హీరోలు చిరంజీవి నుండి మొదలుకుని సాయి ధరమ్ తేజ్ వరకు హీరోలు అంతా కూడా కాప్ స్టోరీలో నటించారు. పోలీస్ యూనిఫార్మ్ లో కనిపించారు. అయితే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాత్రం ఇప్పటి వరకు పోలీస్ గా ఫుల్ లెంగ్త్ పాత్రలో కనిపించలేదు. త్వరలో ఆ ముచ్చట కూడా తీరబోతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇటీవలే 14 రీల్స్ బ్యానర్ లో సాగర్ చంద్ర దర్శకత్వంలో వరుణ్ ఒక సినిమాను చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన మరో లీక్ ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.

ఎఫ్ 3 చిత్రం తర్వాత వరుణ్ చేయబోతున్న సినిమాలో పోలీస్ గా కనిపించబోతున్నాడు. అప్పట్లో ఒక్కడుండేవాడు అనే విభిన్నమైన సినిమాను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు సాగర్ చంద్ర ఈసారి వరుణ్ కోసం మంచి కమర్షియల్ ఎంటర్ టైన్ మెంట్ కమ్ పోలీస్ యాక్షన్ డ్రామా స్ర్కిప్ట్ ను రెడీ చేశాడట. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమాను పట్టాలెక్కిస్తారని తెలుస్తోంది.

ఇప్పటికే 14 రీల్స్ బ్యానర్ లో వరుణ్ ‘గద్దలకొండ గణేష్’ సినిమాను చేసిన విషయం తెల్సిందే. ఆ సమయంలో ఆ బ్యానర్ కు మరో సినిమాను చేసేందుకు వరుణ్ డేట్లు ఇచ్చాడు. ఇప్పుడు ఆ బ్యానర్ లో సాగర్ చంద్ర దర్శకత్వంలో కాప్ స్టోరీతో సినిమాను చేయబోతున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెళ్లడయ్యే అవకాశం ఉందని అంటున్నారు. చరణ్ ‘తుఫాన్’ సినిమాలో మినహా మెగా హీరోలు అంతా కూడా కాప్ స్టోరీలో ఆకట్టుకున్నారు. మరి వరుణ్ కూడా కాప్ స్టోరీతో సక్సెస్ ను దక్కించుకుంటాడా అనేది చూడాలి.