వివి వినాయక్ మంచి మనసు

0

యాక్షన్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్ తన సొంత ప్రాంత ప్రజల పట్ల చూపించిన శ్రద్ద వారి ఆరోగ్యం విషయంలో కనబర్చిన ఆస్తక్తిపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తన ఊరి ప్రజలు కరోనా బారిన పడకూడదనే ఉద్దేశ్యంతో ఏకంగా 30 వేల కరోనా నియంత్రణ ఆయుర్వేద డోసులను రూ.10 లక్షలు ఖర్చు చేసి పంపించాడట. ఈ విషయం ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ చాలా కాలంగా నేను ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాను. ఆ సమస్యకు నాకు ఒక హోమియో డాక్టర్ ను కలిసిన తర్వాత పరిష్కారం దొరికింది.

ఆయనపై నాకు నమ్మకం ఏర్పడినది. అందుకే ఆయన తయారు చేసిన కరోనా నిరోదక ఔషదంను వాడటం జరిగింది. మా కుటుంబం వాడటం మాత్రమే కాకుండా తమ గ్రామంలో అందరికి కూడా దాన్ని ఇవ్వాలనుకున్నాను. ప్రతి ఒక్కరిలో ఇమ్యూనిటీ పెంచే ఆ ఔషదంను దాదాపుగా 30 వేల మందికి ఇచ్చారట. అందుకు వినాయక్ పది లక్షల రూపాయలు ఖర్చు చేసి ఉంటారు అంటున్నారు.

30 వేల డోసుల హోమియో మెడిసిన్ ను ప్రసాద్ రెడ్డి గారితో కలిసి మా ఊరికి పంపాను అంటూ పేర్కొన్నాడు. ఆ ఔషదం వాడటం వల్ల ఊర్లో కరోనా కేసులు చాలా తక్కువగా నమోదు అయ్యాయి అన్నారు. హోమియో గురించి నాకు పెద్దగా నమ్మకం ఉండేది కాదు. కాని కరోనా నుండి కొంత మందిని అయినా కాపాడాలనే ఉద్దేశ్యంతో ఈ పని చేసినట్లుగా వినాయక్ పేర్కొన్నాడు.