Templates by BIGtheme NET
Home >> Cinema News >> అదే నిజమైతే ఎప్పుడో ఆత్మహత్య చేసుకునే దాన్ని

అదే నిజమైతే ఎప్పుడో ఆత్మహత్య చేసుకునే దాన్ని


సింగర్ సునీత పెళ్లి విషయం ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో ట్రెండ్డింగ్ అవుతున్న విషయం తెల్సిందే. గత నెలలోనే సునీత.. రామ్ ల వివాహం జరగాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. రేపు వీరి వివాహం అతి కొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో జరుగబోతుంది. పెళ్లి విషయంలో ఉన్న పుకార్లన్నింటికి ఈ జంట రేపటితో ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. ఇక సునీత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఎవరి విషయంలోనూ జెలసీ ఉండదు అంటూ చెప్పుకొచ్చింది. తాను కొందరి విషయంలో జెలసీతో ఉంటాను అంటూ మీడియాలో వచ్చే వార్తలను కొట్టి పారేసింది.

యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని తెలియజేసింది. గతంలో సింగర్ ఉషతో వివాదం నడిచిందా అంటూ ప్రశ్నించగా తనకు ఎవరితో వివాదాలు లేవని పేర్కొంది. నాకు ఏ ఒక్కరి మీద జెలసీ అనేది లేదని పేర్కొంది. ఒక వేళ అలాంటి ఫీలింగ్స్ నాకు ఉండి ఉంటే ఎప్పుడో ఆత్మహత్య చేసుకునే దాన్ని.. నా జీవితంలో వచ్చిన ఏ ఒక్క వివాదాన్ని పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటూ వెళ్లాను. వివాదాలను పుకార్లను పట్టించుకుంటే ఇప్పటి వరకు నేను బతికే ఉండేదాన్ని కాదేమో అంటూ చెప్పుకొచ్చింది.