Templates by BIGtheme NET
Home >> Cinema News >> పవన్ కళ్యాణ్ సరసన నేచురల్ బ్యూటీ.. ఓకే అంటుందా??

పవన్ కళ్యాణ్ సరసన నేచురల్ బ్యూటీ.. ఓకే అంటుందా??


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో మలయాళం అయ్యప్పన్ కోషియం రీమేక్ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నాడు. ఇదివరకే అధికారిక ప్రకటన వెలువడిన ఈ సినిమా షూటింగ్ సంక్రాంతి తర్వాత అంటే.. జనవరి మూడవ వారం నుండి స్టార్ట్ అవుతుందని సమాచారం. ఇప్పటికే పవన్ వకీల్ సాబ్ సినిమా కంప్లీట్ చేసేసాడు. అలాగే డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో విరూపాక్ష చేయవలసి ఉండగా.. డైరెక్టర్ కు కరోనా పాజిటివ్ రావడంతో షూటింగ్ వాయిదా పడింది. ఇక ఈ గ్యాప్ లో టైం వృధా ఎందుకని పవన్ అయ్యప్పన్ కోషియం రీమేక్ లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ రీమేక్ మూవీ రెగ్యులర్ షూటింగ్ షెడ్యూల్ రెడీ అవుతోంది. పవన్ తో పాటు రానా కూడా ఈ సినిమాలో మరో ప్రధాన హీరోగా నటిస్తున్నాడు.

ఇదిలా ఉండగా.. ఇంతవరకు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరినేది ఖరారు కాలేదు. పలువురి పేర్లు వినిపించినా ఎక్కువగా సాయిపల్లవి పేరు వినిపిస్తుంది. కానీ ఆమె నుండి ఎలాంటి స్పందన లేదని అంటున్నారు మేకర్స్. సాయిపల్లవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. మరి ఆమె తన డేట్స్ పవన్ సినిమాకు కేటాయిస్తుందో లేదో చూడాలి. ఒకవేళ సాయిపల్లవి కాదంటే మాత్రం ఎవరిని ఓకే చేస్తారో మరి. ఫ్యాన్స్ మాత్రం రిపీట్ హీరోయిన్స్ వద్దు అంటున్నారని టాక్. ఇక పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇవ్వనున్న మూవీ వకీల్ సాబ్. ఈ సినిమా పై సినీ అభిమానుల అంచనాలు భారీగా నెలకొన్నాయి. ప్రస్తుతం వకీల్ సాబ్ మేకర్స్ అంతా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే థియేటర్స్ ఓపెన్ అవుతుండటంతో త్వరలోనే వకీల్ సాబ్ విడుదలయ్యే అవకాశం ఉంది. వకీల్ సాబ్ తో పాటు అయ్యప్పన్ కోషియం రీమేక్ సినిమాకు కూడా థమన్ సంగీతం అందిస్తున్నాడు.