Templates by BIGtheme NET
Home >> Cinema News >> స్టార్ కిడ్స్ ఫాలోయింగ్ లో అన్నలను మించిపోతున్న చెల్లెల్లు..!

స్టార్ కిడ్స్ ఫాలోయింగ్ లో అన్నలను మించిపోతున్న చెల్లెల్లు..!


అభిమానులు తమ ఫేవరేట్ హీరోలతో పాటు వారి పిల్లలను కూడా ఫాలో అవుతుంటారు. వారి నట వారసులు అంటూ చిన్నప్పటి నుంచే నెపోటిజం హీరోహీరోయిన్లను రెడీ చేస్తుంటారు. స్టార్ కిడ్స్ బర్త్ డే వచ్చిందంటే ఫ్యాన్స్ చేసే హడావుడి చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టాలీవుడ్ ని ఏలుతున్న స్టార్ హీరోల పిల్లలందరికీ సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. వాళ్లలో సూపర్ స్టార్ మహేష్ బాబు పిల్లలు గౌతమ్ కృష్ణ – సితార.. అల్లు అర్జున్ పిల్లలు అయాన్ – అర్హ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ఫాలోయింగ్ లో ఇద్దరు వారసురాళ్లు సితార – అర్హ లు అన్నలను మించిపోతున్నారని తెలుస్తోంది.

మహేష్ బాబు తనయుడు గౌతమ్ ‘1 నేనొక్కడినే’ సినిమాలో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చాడు. చిన్నప్పటి మహేష్ గా కనిపించి అలరించాడు. అయినా సరే సోషల్ మీడియాలో మాత్రం గౌతమ్ కంటే మహేష్ కూతురు సితార కే ఎక్కువ ఫాలోయింగ్ ఉండటం గమనార్హం. సితార సోషల్ మీడియాలో యాక్టీవ్ గా పోస్టులు పెడుతూ ఎక్కవమంది ఫాలోవర్స్ ని అందుకుంది. ఇన్స్టాగ్రామ్ లో సితారకి ఇప్పటికే 2 లక్షల 36 వేలకుపైగా ఫాలోవర్స్ ఉంటే.. గౌతమ్ కి మాత్రం లక్షా 40 వేల మంది ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. సితారకి సొంత యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి రెండు లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు.

అలానే అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్.. కూతురు అల్లు అర్హ లకు మంచి ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరూ చేసే అల్లరి గురించి ఎప్పటికప్పుడు బన్నీ – స్నేహ దంపతులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటారు. ఇద్దరూ ‘అల వైకుంఠపురములో’ ప్రమోషన్ వీడియో చేశారు. ‘మై గాడ్ డాడీ’ పాటలో చెల్లి ఆర్హతో కలిసి అయాన్ సందడి చేశాడు. ఇక అర్హ ‘బుట్టబొమ్మ’ పాటకి లిప్ రీడింగ్ ఇచ్చిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో అయాన్ కంటే అర్హకే ఎక్కువ మంది ఫాలోవర్స్ కనిపిస్తున్నారు. రాములో రాములా దోశ స్టెప్ నుంచి మొదలుపెడితే.. మొన్నటి అంజలి కవర్ సాంగ్ వరకు అర్హ చేసిన క్యూట్ వీడియోస్ అభిమానులను మురిసిపోయేలా చేసాయి. ఏదేమైనా స్టార్ కిడ్స్ ల్ ఫాలోయింగ్ లో మాత్రం చెల్లెల్లు అన్నలను మించిపోతున్నారని అర్థం అవుతోంది.