తమ రెండవ బేబీని పరిచయం చేసిన స్టార్ కపుల్

0

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన హీరోయిన్ స్నేహా తమిళ నటుడు ప్రసన్నను చాలా కాలం క్రితం వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. వీరిద్దరికి ఇప్పటికే ఒక బాబు ఉన్నాడు. ఇటీవల స్నేహా రెండవ బిడ్డకు జన్మనిచ్చింది. ఇన్ని రోజుల తర్వాత స్నేహా దంపతులు తమ రెండవ సంతానం అయిన పాపను పరిచయం చేశారు. నేడు ప్రసన్న 38వ పుట్టిన రోజు సందర్బంగా పాప ఆధ్యంతా ఫొటోలను రివీల్ చేశారు. ఆధ్యంతా ఈ ఏడాది జనవరి 24వ తారీకున జన్మించింది. పాప ఫొటోలను విడుదల చేసేందుకు సరైన సమయం ఇదే అని ప్రసన్న పుట్టిన రోజుకు ప్రపంచానికి చూపించారు.

హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన ప్రసన్న పెళ్లి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాల్లో చేసింది. ఆధ్యంతా పెద్దగా అయ్యాక మళ్లీ స్నేహా కెమెరా ముందుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ప్రసన్న ఇప్పటికే కొన్న తెలుగు సినిమాల్లో నటించాడు. త్వరలో మరిన్ని సినిమాలను ఆయన తెలుగులో చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా గతంలో ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. వీరిద్దరి జంట.. వీరి పిల్లలు ప్రస్తతుం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.