తల తిరిగే యోగా ఫీట్ అంటే ఇదేనేమో సోనాల్

0

నందమూరి బాలకృష్ణ సరసన `లెజెండ్` చిత్రంలో నటించింది సోనాల్ చౌహాన్. ఆ తర్వాత శ్రీవాస్ `డిక్టేటర్` లో అవకాశం దక్కించుకుంది. `రూలర్` కోసం కె.ఎస్.రవికుమార్ లాంటి సీనియర్ దర్శకుడు సోనాల్ నే ఎంపిక చేసుకోవడం ఆసక్తికరం. లెజెండ్ సినిమాలో ఏ స్థాయిలో గ్లామర్ ట్రీటిచ్చిందో అంతకుమించి రూలర్ లోనూ బికినీలతో చెలరేగి ఈ ముంబై ముద్దుగుమ్మ హీట్ పెంచేసింది.

సోనాల్ బాలీవుడ్ లో ఎంత ప్రయత్నించినా ఆశించిన ఆఫర్లు మాత్రం అందుకోలేకపోయింది. ప్రస్తుతానికి సోషల్ మీడియాల్లో యోగా ఫీట్స్ ని షేర్ చేస్తూ అభిమానుల్ని యంగేజ్ చేస్తోంది. ఇందులో రకరకాల భంగిమల్లో యోగా చేస్తున్న సోనాల్ వాటిని ఇన్ స్టా మాధ్యమంలో వైరల్ చేస్తోంది. ఇదిగో ఇలా ఇరు మోకాలి గుత్తుల మధ్య తలను లాక్ చేసి.. సాహసోపేతమైన ఫీట్ ను వేసింది.

ఇటీవల `స్కై ఫైర్` అనే వెబ్ సిరీస్ లో నటించిన ఈ బ్యూటీ .. ఆ తర్వాత వరుసగా వెబ్ సిరీస్ లకు సంతకాలు చేసేందుకు సై అనేస్తోందట! ప్రస్తుతానికి ఇదిగో ఇలా వేడెక్కించే ఫోటోషూట్లతో అభిమానులకు టచ్ లో ఉంటోంది. సోనాల్ యోగా ఫీట్స్ యూత్ లో వైరల్ గా మారాయి.