ఈ టైంలో పెంచడం భావ్యం కాదు సోను భాయ్

0

కరోనా లాక్ డౌన్ టైం లో వలస కార్మికులు వేలాది మందిని వారి వారి గమ్య స్థానాలకు చేర్చేందుకు గాను కోట్ల రూపాయలు ఖర్చు చేసిన సోనూ సూద్ ఆ తర్వాత కూడా సాయం కోరుతున్న ప్రతి ఒక్కరికి తనవంతు సాయంను అందిస్తున్నాడు. ఇక చదువుపై ఆసక్తి ఉండి చదువుకోలేక పోతున్న వారికి తన తల్లి పేరు మీద స్కాలర్ షిప్ ను ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు. వేలాది మందికి రియల్ హీరోగా మారిన సోనూ సూద్ కొందరికి మాత్రం రియల్ విలన్ గా కనిపిస్తున్నాడు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

టాలీవుడ్ నిర్మాతలకు ఈయన రియల్ విలన్ అయ్యాడు అంటున్నారు. ఎందుకంటే గతంలో కోటి నుండి కోటిన్నర వరకు పారితోషికం తీసుకున్న సోనూ సూద్ ఇప్పుడు ఏకంగా మూడు కోట్లు ఆపై అడుగుతున్నాడట. బాలీవుడ్ లో కంటే టాలీవుడ్ లోనే నటించడం నాకు ఎక్కువ ఇష్టం అంటూ చెబుతున్న సోనూ సూద్ ఇక్కడ భారీ పారితోషికాలు డిమాండ్ చేస్తున్నాడు. ఎలాగూ తన వద్దకు వస్తున్నారు కనుక ఖచ్చితంగా తాను అడిగినంత ఇస్తారనే ఉద్దేశ్యంతో డిమాండ్ చేస్తున్నాడు.

కరోనా కష్టకాలంలో హీరోలు ఇతర టెక్నీషియన్స్ అంతా కూడా పారితోషికాలు తగ్గించుకోవాలని నిర్మాతలు కోరుతుండగా సోనూ సూద్ మాత్రం తన పారితోషికంను అమాంతం పెంచడం పట్ల కొందరు నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోనూ భాయ్ ఇలాంటి సమయంలో పారితోషికం పెంచడం కరెక్ట్ కాదంటున్నారట. సోనూ సూద్ మాత్రం తాను సాయం చేసేందుకు ఈ పారితోషికం తీసుకుంటున్నట్లుగా నిర్మొహమాటంగా చెబుతున్నాడు.