తన విగ్రహాన్ని తానే చేయించుకొని.. శిల్పికి బాలు ఏం చెప్పాడంటే?

0

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణించడంతో అంతటా విషాద చాయలు అలుముకున్నాయి. ఈ క్రమంలోనే ఆయనతో తమకున్న బంధాన్ని అందరూ మీడియా సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

తాజాగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన శిల్ప కూడా ఎస్పీ బాలు తన తల్లిది ఆయన విగ్రహాన్ని తయారు చేయించాడని.. బాలు సొంతూళ్లోని వేద పాఠశాలలో ప్రతిష్టించాలనుకున్నాడని వాపోయాడు. తయారు చేశాక ఫొటోలు తీసి వాట్సాప్ లో పంపిస్తే బాగుందని వాయిస్ మెసేజ్ కూడా పంపాడని ఆవేదన వ్యక్తం చేశారు.

తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన ప్రముఖ శిల్పి డి రాజ్ కుమార్ వడియార్ ఆగస్టు 1న బాలసుబ్రహ్మణ్యం వాయిస్ సందేశం పంపాడు. ‘రాజ్ కుమార్ గారూ.. మీరు పంపిన నా తల్లిగారు.. నా బొమ్మలను చూశాను. చాలా బాగా వచ్చాయి. వాటిలో ఏ లోపాలు లేవు. కరెక్షన్ అవసరం లేదు. నా తల్లిగారిది నెల్లూరులోని వేద పాఠశాలలో పెడుతాను. పంపించే ఏర్పాటు చేయండి’ అంటూ ఎస్పీ బాలు శిల్పి రాజ్ కుమార్ కు వాట్సాప్ సందేశం పంపాడు.

ఎస్పీ బాలు ఇప్పటికే తన తండ్రి శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి కాంస్య విగ్రహాన్ని కూడా శిల్పి రాజ్ కుమార్ తో తయారు చేయించి సింహపురి వేదపాఠశాలలో ప్రతిష్టించాడు. తల్లి విగ్రహాన్ని తయారు చేయించుకున్నాడు. ఈ క్రమంలోనే మరణించడం విషాదం నింపింది. మరణించకముందే యాధృశ్చికంగా తన విగ్రహాన్ని తనే ఎస్పీ బాలు తయారు చేయించుకోవడం విషాదం నింపింది.