నాన్న గురించిన వదంతులు నమ్మవద్దన్న ఎస్పీ చరణ్

0

రెండు రోజుల క్రితం ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థతిపి ఆయన తనయుడు ఎస్పీ చరణ్ మాట్లాడుతూ నాన్న ఆరోగ్యం నిలకడగా ఉందని కాని ఊపిరి తిత్తుల్లో ఉన్న ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన ఇంకా ఐసీయూలోనే ఉన్నారు. ఆయనకు వెంటిలేటర్ ద్వారా శ్వాసను అందిస్తూ ట్రీట్ మెంట్ అందిస్తున్నట్లుగా పేర్కొన్నాడు. కరోనా నుండి బయట పడ్డ నాన్న గారు మాట్లాడుతున్నారు.. తన ఐపాడ్ ను చూస్తున్నారు. క్రికెట్ టెన్నీస్ చూస్తున్నారు అంటూ ఎస్పీ చరణ్ తెలియజేశారు. త్వరలోనే నాన్న ఆరోగ్యం పూర్తిగా కుదుట పడి డిశ్చార్జ్ అవుతారని ఆశిస్తున్నట్లుగా పేర్కొన్నారు.

ఈ సమయంలోనే బాలు ఆరోగ్యం గురించి రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆయన ఆరోగ్యం పూర్తిగా కుదుట పడింది. ఆయన్ను డిశ్చార్జ్ చేసేందుకు ఆసుపత్రి వర్గాలు రెడీ అయ్యాయి. ఆయన పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అవ్వబోతున్నాడు అంటూ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఎస్పీ చరణ్ స్పందించాడు. నాన్న గారు ఇంకా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. కనుక ఆయన డిశ్చార్జ్ ఇంకాస్త సమయం పడుతుంది. ఆయన ఊపిరి తిత్తుల ఇన్ఫెక్షన్ నుండి కోలుకోలేదు. కనుక ఆయన కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని వైధ్యలు అంటున్నారు. కనుక మీడియాలో జరుగుతున్న ప్రచారంను నమ్మవద్దు.

ఈ సమయంలో తాను ఏది అయితే చెబుతున్నానో అదే నమ్మండి. ఇతరులు ఊపిరితిత్తులు చెడిపోయాయి అంటూ చేస్తున్న పుకార్లను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దంటూ పేర్కొన్నాడు. ఈ నెలాఖరు వరకు బాలు గారి ఆరోగ్యం పూర్తిగా కుదుట పడుతుందనే నమ్మకంతో కుటుంబ సభ్యులు ఉన్నట్లుగా తెలుస్తోంది. నాన్న గారి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తానే స్వయంగా వివరాలు అందిస్తాను. ఇతరులు చెప్పేది నమ్మవద్దంటూ జనాలను చరణ్ కోరాడు.