బిగ్ బాస్ 4: ఈ కట్టప్ప ఎవడ్రా బాబు

0

బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఎపిసోడ్ ఆరంభంలోనే ఎప్పుడెప్పుడు మాట్లాడుతుందా అంటూ ఎదురు చూసిన దివి మాట్లాడేసింది. ఆమెకు ఇచ్చిన టాస్క్ ప్రకారం ఆమె ఇంటి సభ్యుల అందరి గురించి ఆమె ఏం గమనించింది వారిలో ఏం మార్చుకోవాల్సి ఉంది అనే విషయాన్ని చెప్పింది. అందులో భాగంగా ఆమె అందరి గురించి వివరించిన తీరు అందరికి బాగా నచ్చింది. బిగ్ బాస్ లో గత మూడు రోజులుగా దివి మాట్లాడక పోవడంతో ఆమెపై నానా రకాల మీమ్స్ వచ్చాయి. ఇప్పుడు ఆమె మాట్లాడటంతో మా దివి పాప మాట్లాడిందోచ్ అంటూ సోషల్ మీడియాలో కొందరు రచ్చ రచ్చ మీమ్స్ చేస్తున్నారు.

ఇక మొదటి ఎపిసోడ్ నుండి మీలో ఒకరు కట్టప్ప ఉన్నారు. వారు ఎవరో గుర్తించండి అంటూ బిగ్ బాస్ హెచ్చరిస్తున్నాడు. మొదటి రోజు నుండి నిన్నటి ఎపిసోడ్ వరకు కట్టప్ప ఎవరు అయ్యి ఉంటారా అంటూ షో లో ఉన్న వారు అంతా కూడా జుట్టు పీక్కుంటున్నారు. ఇప్పటికే ఓటింగ్ ద్వారా కట్టప్ప ఎవరు అనే విషయాన్ని గెస్ చేశారు. కనుక కట్టప్ప ఎవరో అర్థం కాని పరిస్థతి. నిన్నటి ఎపిసోడ్ లో మళ్లీ కట్టప్ప ఎవరు అనే విషయంపై చర్చ జరిగింది. అరియానా మరియు సోహెల్ లను కన్ఫెషన్ రూంకు పిలిచి ఒకొక్కరిని చొప్పున మీ ఉద్దేశ్యం ప్రకారం కట్టప్ప ఎవరు అనుకుంటున్నారు అంటూ ప్రశ్నించాల్సి ఉంది. అందుకు కొందరు ముందుకు వచ్చి తమ అభిప్రాయంను చెప్పగా మరి కొందరు మాత్రం ఇప్పటికే బాక్స్ లో కట్టప్ప ఎవరు అనే విషయంలో మేము క్లారిటీ ఇచ్చాము. మళ్లీ వాళ్లకు చెప్పల్సింది ఏమీ లేదు అన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రేక్షకులు కూడా ఎవడ్రా ఈ కట్టప్ప అంటూ జుట్టు పీక్కుంటున్నారు.

ఇక గంగవ్వ నిన్నటి ఎపిసోడ్ లో మళ్లీ సందడి చేసింది. తన వ్యూలో ఒక్కో ఇంటి సభ్యుల గురించి మాట్లాడింది. అమ్మ రాజశేఖర్ మాస్టర్ వంటలు బాగా చేస్తున్నాడని సూర్య కిరణ్ పంచాయితీలు తీరుస్తున్నాడని అఖిల్ రాత్రి అంతా పడుకున్న తర్వాత కూడా అందరు మంచిగ ఉన్నారా లేరా అనే విషయాలను పరిశీలిస్తున్నాడు అంది. ఇక దివి తనను బాగా చూసుకుంటుంది. అమమ్మ అంటూ కాళ్లు కూడా ఒత్తుతుందని పేర్కొంది. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ అంతా సందడి సందడిగా సాగిపోయింది.