నాని ‘జెర్సీ’ స్టార్ ద్విభాషా చిత్రం!!

0

నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన జెర్సీ సినిమాలో కీలక గెస్ట్ రోల్ లో కనిపించిన తమిళ స్టార్ నటుడు హరీష్ కళ్యాణ్ ఆకట్టుకున్నాడు. ఉన్నంత సమయం మంచి స్ర్కీన్ ప్రజెన్స్ తో మెప్పించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ తో హరీష్ మంచి నటన కనబర్చాడు. నాని కొడుకు పాత్రలో కనిపించిన హరీష్ కళ్యాణ్ మళ్లీ తెలుగులో నటించలేదు. అతడికి తెలుగులో ఆఫర్లు వస్తున్నా కూడా మంచి పాత్రల కోసం వెయిట్ చేస్తున్నాడట. తాజాగా ఈయన బిచ్చగాడు దర్శకుడు శశి దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు ఓకే చెప్పాడు. అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

జెర్సీ సినిమాతో తెలుగులో గుర్తింపు రావడం వల్ల ఈసారి చేయబోతున్న సినిమాను తమిళంతో పాటు తెలుగులో కూడా చేయాలని ఆయన భావిస్తున్నాడు. దానికి తోడు బిచ్చగాడు సినిమాతో దర్శకుడికి తెలుగు లో మంచి క్రేజ్ దక్కింది. ఇద్దరు కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన వాళ్లే అవ్వడం వల్ల తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమాను రూపొందించి విడుదల చేస్తే మంచి లాభాలు వస్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ద్విభాష చిత్రం అంటూ చెప్పినా కూడా ఒకే భాషలో తెరకెక్కించి డబ్ చేసి విడుదల చేస్తారు అంటున్నారు. ఏది ఏమైనా ఈ కాంబో ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకుల దృష్టిని కూడా ఆకర్షించడం ఖాయం అంటున్నారు.