కొందరు బొద్దుగా ముద్దుగా..మరికొందరు సన్నగా సన్నజాజిలా..!

0

కరోనా వైరస్ కారణంగా అందరి జీవనంలో అలవాట్లలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక ఎప్పుడూ బిజీ బిజీగా గడిపే సినీ సెలబ్రిటీలు కూడా ఆరు నెలల పాటు ఇంటికే పరిమితం అయ్యారు. సినిమా షూటింగ్స్ లేకపోవడంతో ఇంటిపట్టునే ఉంటూ రకరకాల వ్యాపకాలతో కాలక్షేపం చేశారు. కొందరు హీరోయిన్స్ ఇంట్లోనే ఉన్నా ఫిట్నెస్ ని అశ్రద్ధ చేయకుండా రెగ్యులర్ గా వర్కౌట్స్ చేసుకుంటూ ఫిజిక్ మైంటైన్ చేస్తూ వచ్చారు. మరికొందరు మాత్రం సినిమా షూటింగ్స్ కి ఇంకా చాలా టైం ఉందిలే అని ఇంట్లో రకరకాల వంటకాలు నేర్చుకొని వాటిని ఆస్వాదించారు. ఈ క్రమంలో ఈ లాక్ డౌన్ పీరియడ్ లో కొంతమంది హీరోయిన్స్ బొద్దుగా ముద్దుగా తయారైతే మరికొందరు సన్నగా సన్నజాజి తీగలా మారి కనువిందు చేస్తున్నారు. లాక్ డౌన్ కి ముందు ఫోటోలు ఇప్పుడు రీసెంట్ ఫోటోలు గమనిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది.

కాగా లాక్ డౌన్ లో ఫిజిక్ పరంగా చాలా మార్పులు కనిపించిన వారిలో గోవా బ్యూటీ ఇలియానా ముందు వరుసలో ఉంటారు. ఇంతముందు బొద్దుగా ఉండి ఫ్యాన్స్ ని కంగారు పెట్టిన ఇల్లీ బేబీ ఇప్పుడు స్లిమ్ గా మారి అదరగొడుతోంది. 50 డేస్ ఛాలెంజ్ అంటూ రెగ్యులర్ గా వ్యాయామాలు.. డైట్ మైంటైన్ చేస్తూ బరువు తగ్గిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకి హీట్ పెంచేస్తోంది. ఇక యాపిల్ బ్యూటీ హన్సిక మోత్వానీ కూడా ఇంతక ముందు బొద్దుగా ముద్దుగా ఉండేదని తెలుసు. అయితే ఇప్పుడు అమ్మడి లేటెస్ట్ పిక్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. దీని కోసం ఈ దేశముదురు బ్యూటీ భారీ కసరత్తులు చేసి బాగానే కష్టపడిందని తెలుస్తోంది.

జిమ్ మైంటైన్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన ఫిజిక్ ని బాగానే కాపాడుకుంది. వర్కౌట్స్ చేయడమే కాకుండా మంచు లక్ష్మితో కలిసి సైక్లింగ్ కూడా చేస్తూ చమటలు చిందించింది. ఈ క్రమంలో బక్కగా మారిపోయింది. ఇక చందమామ కాజల్ అగర్వాల్ లాక్ డౌన్ ప్రారంభంలో కొన్ని రోజులు కాస్త ఒళ్ళు చేసినట్లు కనిపించింది. అయితే రీసెంటుగా అప్లోడ్ చేసిన ఫోటోలలో స్లిమ్ గా కనిపించింది. స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని కాస్త బొద్దుగా ముద్దుగా మారినట్లు అర్థం అవుతోంది. కరోనా డేస్ లో వర్కౌట్స్ చేసినప్పటికీ సామ్ ఇంతకముందు కంటే కొంచెం ఒళ్ళు చేసినట్లుగా అనిపిస్తోంది. డెహ్రాడూన్ బ్యూటీ లావణ్య త్రిపాఠి కూడా బొద్దుగా కనిపిస్తోంది. అయితే బొద్దుగా ఉన్నా సన్నగా ఉన్నా వీళ్ళందరూ ముద్దుగానే ఉన్నారనేది మాత్రం నిజం.