‘పుష్ప’ రిస్క్ లేకుండా మొదలు పెట్టబోతున్నాడు

0

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందబోతున్న మూవీ ‘పుష్ప’. ఈ చిత్రం షూటింగ్ మొదలు పెట్టాలనుకున్న సమయంలో కరోనా మహమ్మారి విజృంభించడంతో షూటింగ్ ఆగిపోయింది. ఆరు నెలలుగా పుష్ప షూటింగ్ మొదలు కాకుండానే ఆగిపోయింది. ఇప్పటికి షూటింగ్ కు వెళ్లేందుకు దర్శకుడు సుకుమార్ రెడీ అవుతున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్టోబర్ రెండవ వారం నుండి హైదరాబాద్ లోని ఒక స్టూడియోలో షూటింగ్ ప్రారంభించబోతున్నారు.

పాటతో షూటింగ్ ను ప్రారంభించడం వల్ల రిస్క్ తక్కువ అంటున్నారు. షూటింగ్ కు ఎక్కువ యూనిట్ సభ్యులు అవసరం ఉండరని వారం నుండి పదిరోజుల పాటు సాంగ్ ను షూట్ చేస్తే తర్వాత కూడా చాలా ఎనర్జిటిక్ గా షూటింగ్ సాగే అవకాశం ఉందని సుకుమార్ భావిస్తున్నాడట. అక్టోబర్ రెండవ వారంలో ప్రారంభం కాబోతున్న ఈ సినిమా పాట చిత్రీకరణ తర్వాత వెంటనే ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సీన్స్ ను ప్లాన్ చేయబోతుందట. ఇటీవల రష్మిక హైదరాబాద్ వచ్చి ఈ సినిమా కోసం ఏర్పాటు చేసిన వర్క్ షాప్ లో పాల్గొంది. ఆమె చిత్తూరు యాసతో పాటు పలు విషయాలనపై ట్రైనింగ్ తీసుకుంటుందట. అక్టోబర్ మొదటి వారంలో మళ్లీ హైదరాబాద్ కు వచ్చి పుష్ప షూటింగ్ లో రష్మిక మందన్న పాల్గొనబోతుంది.