Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘మన్మథుడు 2’ మ్యూజిక్ డైరెక్టర్ ని సిద్ శ్రీరామ్ సక్సెస్ ట్రాక్ ఎక్కించేనా…?

‘మన్మథుడు 2’ మ్యూజిక్ డైరెక్టర్ ని సిద్ శ్రీరామ్ సక్సెస్ ట్రాక్ ఎక్కించేనా…?


టాలీవుడ్ లో ‘Rx 100’ మూవీ ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ఆ సినిమాలోని పాటలు కూడా అదే రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసాయి. ఈ సినిమాలోని ‘పిల్లా రా..’ ‘రెప్పల నిండా..’ ‘మనసుని పట్టి..’ ‘అదిరే హృదయం..’ వంటి సాంగ్స్ ఇప్పటికి సందడి చేస్తూనే ఉన్నాయి. ఇలాంటి అద్భుతమైన పాటలు సమకూర్చింది మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్. డెబ్యూ మూవీ ‘Rx 100’తో ఓవర్ నైట్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మారిపోయిన చైతన్ భరద్వాజ్ కు వరుస అవకాశాలు వచ్చి పడ్డాయి. ఈ క్రమంలో ‘గుణ 369’ అనే సినిమాకి చైతన్ అందించిన పాటలు యూత్లో క్రేజ్ నింపాయి. దీంతో స్టార్ హీరో అక్కినేని నాగార్జున సినిమాకి మ్యూజిక్ అందించే ఛాన్స్ దక్కించుకున్నాడు. చి.ల.సౌ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ‘మన్మథుడు 2’ చిత్రానికి చైతన్ భరద్వాజ్ స్వరాలు అందించారు. నాగార్జున సూపర్ హిట్ ‘మన్మథుడు’ సినిమాకి సీక్వెల్ గా రూపొందిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఎలాంటి రిజల్ట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ‘మన్మథుడు 2’ ప్రభావం ఆ సినిమాకి పనిచేసిన అందరి మీద పడినట్లే చైతన్ భరద్వాజ్ కెరీర్ మీద కూడా పడిందనే చెప్పాలి. ‘మన్మథుడు 2’ కి చైతన్ మంచి మ్యూజిక్ అందించాడనే టాక్ వచ్చినప్పటికీ సినిమా రిజల్ట్ వల్ల క్రేజీ ఆఫర్స్ కి దూరంగా ఉండాల్సి వచ్చింది.

ఈ నేపథ్యంలో ‘ఎస్ ఆర్ కళ్యాణమండపం’ అనే సినిమాకి మ్యూజిక్ అందించే అవకాశం అందుకున్నాడు చైతన్ భరద్వాజ్. ‘రాజావారు రాణిగారు’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం – ‘టాక్సీవాలా’ ఫేమ్ ప్రియాంక జవాల్కర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి శ్రీధర్ గదె దర్శకత్వం వహిస్తున్నారు. ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ‘ఎస్ ఆర్ కళ్యాణమండపం’ సినిమా కోసం మంచి ట్యూన్స్ రెడీ చేసిన చైతన్ భరద్వాజ్.. మూడు సాంగ్స్ యువ మ్యూజిక్ సంచలనం సిద్ శ్రీరామ్ తో పాడించాలని అనుకున్నాడట. దీనికి బడ్జెట్ ఎక్కువైనా పర్లేదని సిద్ శ్రీరామ్ తో మేకర్స్ ఏకంగా మూడు పాటలు పాడించేశారట. ఈ మధ్య సిద్ ఆలపించిన సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అవడమే కాకుండా సినిమాకి మంచి బజ్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి చైతన్ భరద్వాజ్ ను ఇప్పుడు సిద్ శ్రీరామ్ గాత్రం మళ్లీ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి.