నిజంగా అంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడా…?

0

‘బాహుబలి’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఒక్క సినిమాతో టాలీవుడ్ స్టార్ హీరో కాస్తా పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్నాడు. ఈ క్రమంలో ‘సాహో’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ కి తన స్టామినా ఏంటో చూపించాడు. ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ సినిమాలో నటిస్తున్న ప్రభాస్.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్ చేసాడు. దీంతో పాటు ‘ఆదిపురుష్’ అనే స్ట్రెయిట్ హిందీ మూవీ కూడా ప్రకటించాడు. ప్రస్తుతం ఇండియన్ సినిమాలో మోస్ట్ వాంటెడ్ హీరోగా వెలుగొందుతున్న ప్రభాస్ క్రేజ్ కి తగ్గట్టే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది.

కాగా టాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. ‘రాధే శ్యామ్’ సినిమాని హోమ్ బ్యానర్ లో ఫ్రెండ్స్ తో కలిసి చేస్తున్న ప్రభాస్.. నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ మరియు ‘ఆదిపురుష్’ సినిమాలకు భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. నాగ్ అశ్విన్ సినిమా కోసం సుమారు 80 కోట్లు తీసుకుంటున్న ప్రభాస్.. ‘ఆదిపురుష్’ కోసం సుమారు 100 కోట్లు పారితోషకంగా తీసుకోబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. నిజానికి ఒక సినిమా 100 కోట్లు కలెక్ట్ చేస్తేనే గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. అలాంటిది ఒక హీరో రెమ్యూనరేషన్ ఆ రేంజ్ లో ఉందంటే మాములు విషయం కాదు.

అయితే ‘ఆదిపురుష్’ సినిమాని నిర్మిస్తున్న టీ – సిరీస్ వారు ప్రభాస్ కోసం బాలీవుడ్ స్టార్స్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వడానికి ముందుకొచ్చారని తెలుస్తోంది. ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ ప్రస్తుతం ప్రభాస్ రెమ్యూనరేషన్ గురించే అందరూ చర్చించుకుంటున్నారు. ఇదే కనుక నిజమైతే మాత్రం భారీ రెమ్యునరేషన్ అందుకున్న ఫస్ట్ హీరో మన డార్లింగ్ అవుతాడని చెప్పవచ్చు.