ద్వీపంలో రాకుమారిలా కింగ్ ఖాన్ వారసురాలు

0

అన్నీ సరిగా కుదిరితే ఈపాటికే కింగ్ ఖాన్ నటవారసురాలు సుహానా ఖాన్ వెండితెర ఆరంగేట్రం జరిగిపోయేది. కానీ సీమ్ మొత్తం రివర్సయ్యింది. కరోనా మహమ్మారీ ఊహించని విపత్తులా మారి అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఇలాంటి టైమ్ లో డెబ్యూ నాయిక గా సుహానా ఖాన్ ఎంట్రీ ఏమంత బాగోదేమో! అందుకే ఇప్పటికి ఆ టాపిక్ కట్ చేస్తున్నారు ఖాన్ జీ.

ఇకపోతే సుహానా మాత్రం సోషల్ మీడియాల్లో చాలా స్పీడ్ గానే ఉంది. ఈ రోజు సుహానా ఖాన్ తనను తాను ‘ద్వీపంలో అమ్మాయి’ అని ట్యాగ్ చేయడంతో పాటు సోషల్ మీడియాల్లో వరుసగా త్రోబాక్ ఫోటోలను పంచుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

సుహానా ఖాన్ ఇన్ స్టాగ్రామ్ లో ఇప్పటికే ఎన్నో తాజా వీడియోలతో పాటు రకరకాల సీక్రెట్స్ కి సంబంధించిన ఫోటోల్ని షేర్ చేసింది. సోదరులు ఆర్యన్ – అబ్రమ్ల ఫోటోలను ఇక్కడ షేర్ చేసింది. తన స్నేహితురాళ్లతో ఉన్నప్పటి ఫోటోల్ని ఇదివరకూ షేర్ చేసిన సుహానా మరోసారి సోలో ఫోటోను పోస్ట్ చేసింది. అందులో ఆమె కెమెరాకు పోజులివ్వడంతో పాటు ఆసక్తికర వ్యాఖ్యను జోడించింది. “ఐలాండ్ గర్ల్…” ఒక ఫోటోలో ఆమె రాళ్ళపై కూర్చుని ఉండగా.. మరొక ఫోటో సుహానా బీచ్ పరిసరాల్లో సెల్ఫీ క్లిక్ చేసింది.

సుహానా ఫోటోలకు సంజయ్ కపూర్ భార్య మహీప్ కపూర్ వెంటనే స్పందిస్తూ.. అనేక బ్లాక్ హార్ట్ ఎమోజీలను షేర్ చేశారు. సుహానా ఖాన్ తన తల్లిదండ్రులైన షారుఖ్ ఖాన్ – గౌరీ ఖాన్లతో ప్రస్తుతం ముంబైలో స్వీయనిర్బంధంలో ఉన్నారు.లాక్ డౌన్ కు ముందు సుహానా ఖాన్ న్యూయార్క్ లో చదువుకుంది. ముంబైలో విద్యను పూర్తి చేసిన తరువాత సుహానా సస్సెక్స్ లోని ఆర్డింగ్లీ కాలేజీలో చదువుకోవడానికి యుకె వెళ్లారు. 2019 లో ఆమె న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో చేరారు. ప్రస్తుతం అక్కడ ఫిల్మ్ మేకింగ్ చదువుతోంది.