బిగ్ బాస్ 4: కరాటే కళ్యాణిపై గంగవ్వ పంచ్.. పిచ్చాసుపత్రి లెక్క చేత్తానవ్ అంటూ గాలి తీసేసింది

0

బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన బిగ్ బాస్ సీజన్ 4 మొత్తానికి ప్రారంభమైంది. లాక్‌డౌన్, కరోనా ఎఫెక్ట్ కారణంగా ఈ ఏడాది షో ఉండదేమో అని నిరాశ చెందిన ప్రేక్షకుల్లో నూతనోత్సాహం నింపుతూ బిగ్ బాస్ పార్టిసిపెంట్స్‌ని రంగంలోకి దించారు హోస్ట్ నాగార్జున. గత సీజన్లతో పోల్చితే ఈ సారి బిగ్ బాస్ కంటిస్టెంట్స్ కొందరు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేనప్పటికీ హౌస్‌లో ఉన్న

గంగవ్వ లాంటి యూ స్టార్స్ మాత్రం స్పెషల్ అట్రాక్షన్ అవుతున్నారు. ఆదివారం నాడు మొదలైన ఈ షో రసవత్తరంగా సాగుతోంది. తాజాగా ఈ రోజు (మంగళవారం) ప్రసారం కానున్న షో తాలూకు ప్రోమో రిలీజ్ చేశారు.

ఈ ప్రోమో వీడియోలో కరాటే కళ్యాణి, గంగవ్వ సందడి ఎక్కువగా కనిపించింది. దర్శకుడు సూర్య కిరణ్ ర్యాప్ సాంగ్‌తో పాటు కరాటే కళ్యాణి టీచర్ టాస్క్ చూపించారు. చేతిలో బెత్తం పట్టుకొని టీచర్ అవతారమెత్తిన కరాటే కళ్యాణి హౌస్‌మేట్స్ అందరికీ పాఠాలు చెబుతూ కనిపించింది. టాస్క్‌లో భాగంగా.. అవ్వ నువ్వు 50ఏళ్ల నుంచి ఇదే స్కూల్‌లో ఉంటున్నావ్ కదా అని కళ్యాణి గంగవ్వను కామెంట్ చేయడంతో వెంటనే హౌస్‌మేట్స్ అంతా అవ్వ ఇన్నేళ్ల నుంచి ఫెయిల్ అవుతున్నావా? అంటూ ఆమెను టీజ్ చేశారు.

Also Read: పాపం.. గంగవ్వని నామినేట్ చేసిన బిగ్ బాస్ ఇంటి సభ్యులు.. కరాటే కళ్యాణి రచ్చ రచ్చ

దీంతో చిర్రెత్తిపోయిన గంగవ్వ.. కళ్యాణిపై రిటర్న్ పంచ్ వేసి ఆమె గాలి తీసేసింది. జీతం జీతమే తీసుకుంటున్నావ్.. ఇట్లనే అందరినీ ఫెయిల్ చేస్తున్నావ్. పిచ్చాసుపత్రి లెక్క చేత్తానవ్ అంటూ కౌంటర్ వేసింది. దీంతో నేటి ఎపిసోడ్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కాగా ఈవారం ఎలిమినేషన్‌లో భాగంగా.. నామినేషన్స్ ప్రక్రియను షురూ చేయగా అందులో గంగవ్వ పేరును నామినేట్ చేశారు హౌస్‌మేట్స్. ఈ వారానికి గాను అభిజిత్, సూర్యకిరణ్, అఖిల్ సార్థక్, దివి, మెహబూబా, సుజాత, గంగవ్వలు ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు.