వావ్ నిజంగా ప్రిన్స్ లా ఉన్నాడు

0

వారసత్వంతో వచ్చినంత మాత్రాన స్టార్స్ అవ్వాలనే ఏమీ లేదు. స్టార్ వారసులు ఎంతో మంది సినిమా పరిశ్రమలో అడుగు పెట్టి వెళ్లి పోయిన విషయం తెల్సిందే. ఎవరైతే నిజంగా ప్రతిభ ఉండి రాణించాలనే తాపత్రయంతో కష్టపడ్డారో వారికి ఫలితం దక్కింది. సూపర్ స్టార్ కృష్ణ వారసులు ఇద్దరు రమేష్ బాబు.. మహేష్ బాబులు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. అయితే రమేష్ బాబు నటుడిగా రాణించలేక పోయాడు. మహేష్ బాబు నటుడిగా రాణించి అంచలంచెలుగా ఎదుగుతూ తండ్రిని మించిన తనయుడు అనిపించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. తండ్రి సూపర్ స్టార్ ట్యాగ్ మహేష్ కు అంత సింపుల్ గా రాలేదు.

ఇక సూపర్ స్టార్ కు ముందు మహేష్ ను ప్రిన్స్ అనే వారు. ఆయనకు ఆ బిరుదు కూడా ఊరికే రాలేదు. చూడ్డానికి నిజంగా ప్రిన్స్ లా ఉండేవాడు. అందుకే అలా పిలిచేవారు అనడంలో సందేహం లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పిక్ ను చూస్తుంటే నిజంగా ప్రిన్స్ మాదిరిగా ఉన్నాడుగా అనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చిన్న తనంలోనే సూటు బూటూ ఆ క్యూట్ నెస్ అన్ని కలగలిపి వావ్ అన్నట్లుగా ప్రిన్స్ అంటే ఇలాగే ఉంటాడు అన్నట్లుగా మహేష్ బాబు ఉన్నాడు.