రేవంత్ రెడ్డి సక్సెస్ వెనుక అదేనా?

0

2018 అసెంబ్లీ ఎన్నికల్లో తనకు పెట్టని కోట అయిన కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఓడిపోయాడు. అయినా కృంగిపోకుండా తరువాత ఎంపీ ఎన్నికల వరకు తప్పు ఒప్పులు తెలుసుకొని సరిదిద్దుకొని లోక్సభ ఎన్నికల్లో హైకమాండ్ దగ్గరికి వెళ్లి ఎంపీ సీటు తెచ్చుకున్నాడు. మల్కాజ్ గిరి ఎంపీ స్థానంలో.. ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ కు చెందిన వారు లేకున్నా.. వార్డ్ మెంబర్ కూడా కాంగ్రెస్ కు లేకపోయినా రేవంత్ రెడ్డి గెలిచాడు..

టీఆర్ఎస్ కు మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేలు మంత్రి సాలిడ్ గా బూత్ స్థాయి నుంచి కార్యకర్తల బలం ఉన్నా కూడా రేవంత్ రెడ్డికే ఓట్లు వచ్చాయి. దానికి కారణంగా టీడీపీకి మల్కాజిగిరి పార్లమెంట్ బలమైన ఓటు బ్యాంకు ఉండడమే..

మళ్లీ రేవంత్ రెడ్డి రాష్ట్రస్థాయి నేతగా పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్నాడంటే అదంతా మల్కాజిగిరి ఎంపీ గెలవడం వల్లనే.. రేవంత్ ఖచ్చితంగా తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడని ప్రజల్లో ఒక నమ్మకం కలిగింది. గెలిచిన తరువాత రేవంత్ ప్రజా సేవలోనే తరిస్తున్నాడట.. మరోసారి ఓడిపోకుండా ప్రజల కోసం అన్ని ఆఫీసుల్లో సంబంధాలు పెట్టుకొని పనులు చేస్తున్నాడట. రేవంత్ లో మార్పు వచ్చిందని ఎవరిని అడిగినా చెప్తున్నారు.