200 దేశాల్లో రిలీజ్ .. ఓటీటీలో ఈ కామెడీలేమిటో!

0

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన `ఆకాశమే నీ హద్దురా` ఓటీటీలో రిలీజవుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ లో అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ విడుదల కానుంది. ఈ సినిమాకి గురు ఫేం సుధ కొంగర దర్శకత్వం వహించారు. సూర్య నిర్మాత.

తొలుత ఈ సినిమా 150 దేశాల్లో రిలీజవుతుంది. ఆ తర్వాత 200 దేశాల్లో అందుబాటులోకి వస్తుందట. సూర్య నిర్మాణ సంస్థ 2డి ఎంటర్ టైన్ మెంట్స్ రాజశేఖర్ పాండియన్ తో కలిసి అక్టోబర్ 30 న 200 దేశాల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లలో ఉన్నారని తెలుస్తోంది.

అంతా బాగానే ఉంది కానీ.. అమెజాన్ ప్రైమ్ 200 పైగా దేశాల్లో అందరికీ అందుబాటులో ఉన్నదే కదా! ఇక వీళ్లు సపరేట్ గా రిలీజ్ చేసేది ఏం ఉంటుంది? అన్నిచోట్లా అమెజాన్ ప్రతినిధులతో కోఆర్డినేట్ చేయడమేనా? చేసేస్తే పోలా.. దానికి మరీ ఈ రేంజు ప్రచారం దేనికి? డిజిటల్ రిలీజ్ కి థియేట్రికల్ రిలీజ్ చేసినంత కలరింగ్ దేనికి? అని పంచ్ లు వేస్తున్నారు. ఇతర దేశాల్లో రిలీజ్ చేయాలంటే దానికి అనుమతులు వగైరా అవసరమా? అన్నది తేలాల్సి ఉంది. అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటించగా జీవీ ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.