ఆ మిస్ట్రరీ కేసుల సరసన సుశాంత్ కేసు కూడా

0

బాలీవుడ్ సినీ ప్రముఖులు మరియు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు కొందరు అనూహ్యంగా మృతి చెంది హాట్ టాపిక్ గా నిలిచారు. పలువురు మృతులకు సంబంధించిన కేసులను పోలీసులు.. సీబీఐ వారు ఏళ్లకు ఏళ్లు ఎంక్వౌరీ చేసి చివరకు మిస్ట్రరీ కేసుగా వదిలేశారు. కొన్ని ప్రభుత్వ నిర్ణయానుసారం వదిలి వేయడం కొన్ని క్లూ దొరక్క పోవడం వల్ల వదిలేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ మిస్ట్రరీ కేసుల జాబితాలో సుశాంత్ ఆత్మహత్య కేసు కూడా చేరబోతుందా అంటే అవును అంటూ జాతీయ మీడియా వర్గాల వారి ద్వారా సమాచారం అందుతోంది.

సుశాంత్ కేసును సీబీఐ ఎంక్వౌరీ చేస్తుంది. వారు ఎంక్వౌరీ చేయబట్టి నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు ఎలాంటి ఫలితం దక్కలేదు. సుశాంత్ ది హత్య అంటూ నిరూపించేందుకు ఒక్క ఆధారం కూడా లభించలేదు. ఇదే సమయంలో సుశాంత్ ది ఆత్మహత్య అనేందుకు కూడా ఎక్కువ ఆధారాలు కనిపించడం లేదు అంటున్నారు. అందుకే చాలా కేసులు వదిలేసినట్లుగానే ఈ కేసులను కూడా వదిలేసి సీబీఐ చేతులు దులుపుకోవాలని భావిస్తుందా అంటూ సుశాంత్ అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సుశాంత్ మృతికి కారణం నెపొటిజం కారణం అంటూ కొందరు.. ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి అంటూ కొందరు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ వారు మాత్రం ఒక నిర్ణయం తీసుకోలేక పోతున్నారు. అందుకే దీనిని మిస్ట్రరీ కేసుగా వదిలేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.