Templates by BIGtheme NET
Home >> Cinema News >> బ్రేకింగుల్లో రికార్డులు సృష్టించిన సుశాంత్ మిస్టరీ కేసు

బ్రేకింగుల్లో రికార్డులు సృష్టించిన సుశాంత్ మిస్టరీ కేసు


బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్ప మృతి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ లకే బ్రేకింగ్ గా మారుతోంది. సుశాంత్ సింగ్ కి సంబంధించిన కథనాలు గత కొన్ని వారాలుగా టాప్ ట్రెండింగులో నిలవడం విస్మయానికి గురిచేస్తోంది. సుశాంత్ మృతి చెందిన తరువాత ఇంతకుమించిన చాలా చాలా బ్రేకింగ్ వార్తుల బయటికి వచ్చాయి. కానీ అవేవీ సుశాంత్ మృతికి సంబంధించిన వరుస కథనాల్ని బీట్ చేయలేకపోయాయి. వాటన్నింటినీ సుశాంత్ డెత్ మిస్టరీ సెన్సేషన్స్ కప్పేయడం చర్చనీయాంశంగా మారింది.

బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్- నెల్సన్ సంస్థలు చేసిన మార్కెటింగ్ రీసెర్చ్ సర్వేలో ఈ సంచలన విషయం బయటపడింది. ప్రైమ్ టీవీ న్యూస్ విభాగంలో సుశాంత్ డెత్ న్యూస్ గత నాలుగు వారాలుగా టాప్ వార్తల్లో నంబర్ 1గా నిలవడం విశేషంగా చెబుతున్నారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ జూన్ 14న తన అపార్ట్ మెంట్ లోని బెడ్ రూమ్ లో అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ముందు ఇది ఆత్మ హత్య అని ముంబై పోలీసులు తేల్చారు. కానీ ఆ తరువాత నుంచి సుశాంత్ మరణం వెనుక ఏదో మిస్టరీ దాగివుందని వరుస ట్విస్ట్ లు మొదలయ్యాయి.

ప్రతీ రోజు ఏదో ఒక వార్త ప్రైమ్ టైమ్ న్యూస్ గా హల్ చల్ చేస్తూనే వుంది. ప్రతీ రోజూ సుశాంత్ కు సంబంధించిన ఓ వార్త హెడ్ లైన్స్ లో నిలుస్తూనే వుంది. ప్రతీ వారం ఓ కీలక మలుపు తిరుగుతూ హెడ్ లైన్స్ లో నిలుస్తూనే వుంది. ముఖ్యంగా జూలై 25 నుంచి ఆగస్టు 21 వరకు వివిధ బ్రేకింగ్ న్యూస్ వచ్చాయి. ఆగస్టు ఫస్ట్ వీక్ లో రామమందరానికి సంబంధించిన భూమి పూజ జరిగింది. అయితే ప్రధాన ఛానల్స్ మొత్తం ఈ వార్తని ప్రసారం చేసినా ప్రధానంగా సుశాంత్ కేసుపైనే దృష్టి సారించాయి. ఆ తరువాత కోజికోడ్ ఏయిర్ క్రాఫ్ట్ క్రాష్ దుర్ఘటన.. రాజస్థాన్ రాజకీయ సంక్షోభం.. ఎం.ఎస్ థోనీ రిటైర్మెంట్ వంటి అంశాలని మించి సుశాంత్ డెత్ బ్రేకింగ్స్ టాప్ లో నిలిచింది. టీవీ వ్యూవర్ షిప్ లాక్ డౌన్ తరువాత 200 శాతం పెరిగితే అందులో అత్యధిక శాతం సుశాంత్ డెత్ కేసు వల్ల పెరగడం గమనార్హం.